Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikramarkudu: విక్రమార్కుడు విలన్ భావుజీ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా.?

రవితేజ, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఒకే ఒక్క సినిమా ఇది. ఈ చిత్రంలో రవితేజ రెండు గెటప్స్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. అత్తిలి సత్తిబాబు అనే దొంగ క్యారెక్టర్ లో ఆయన నవ్వులు పూయించాడు. అలాగే విక్రమ్ రాథోడ్ అనే పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో తన యాక్షన్ తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. అనుష్క హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు.

Vikramarkudu: విక్రమార్కుడు విలన్ భావుజీ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా.?
Vikramarkudu
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 01, 2024 | 12:09 PM

మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా సినిమా విక్రమార్కుడు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రవితేజ, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఒకే ఒక్క సినిమా ఇది. ఈ చిత్రంలో రవితేజ రెండు గెటప్స్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. అత్తిలి సత్తిబాబు అనే దొంగ క్యారెక్టర్ లో ఆయన నవ్వులు పూయించాడు. అలాగే విక్రమ్ రాథోడ్ అనే పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో తన యాక్షన్ తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. అనుష్క హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. ఇటీవలే ఈ సినిమా రీ రిలీజ్ అయ్యింది. రీ రిలీజ్ ను కూడా ఆడియన్స్, రవితేజ ఫ్యాన్ యమా ఎంజాయ్ చేశారు. ఇక ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

ముఖ్యంగా ఈ సినిమాలో బీహారీ విలన్ గా నటించిన నటుడు తెగ నవ్వించారు. విచిత్రమైన వాయిస్ తో ఆయన పాత్ర ఉంటుంది. నిజానికి ఆయనకు డబ్బింగ్ చెప్పింది నటుడు సాయి కుమార్ సోదరుడు బొమ్మాలి రవిశంకర్. అయితే భావుజీ క్యారెక్టర్‌లో నటించిన ఆయన పేరు వినీత్ కుమార్.  బీహార్ కు చెందిన ఆయన కొన్ని తెలుగు సినిమాల్లో నటించారు. కానీ ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించాడు.

విక్రమార్కుడు తర్వాత వినీత్ కుమార్ క్రేజ్ పెరిగింది. తెలుగులో రామ రామ కృష్ణ కృష్ణ, కందిరీగ, నాయక్, ఆగడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, శివమ్, సర్దార్ గబ్బర్ సింగ్, సుప్రీం, ఇంటలిజెట్, టచ్ చేసి చూడు, ఆపరేషన్ 2019, చాణక్య, బంభాట్  లాంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం తెలుగు సినిమాల కంటే హిందీ సినిమాల పైనే ఎక్కువ ద్రుష్టి పెట్టారు. అయితే ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడు. అంటూ కొంతమంది సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఫోటోలు కొన్ని వైరల్ గా మారాయి. వినీత్ కుమార్ ఇప్పుడు ఎలా ఉన్నాడో మీరే చూడండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

UPSCలో TV రిపేర్‌మ్యాన్ కొడుకు సత్తా.. ప్రిపరేషన్ సీక్రెట్ తెలుసా
UPSCలో TV రిపేర్‌మ్యాన్ కొడుకు సత్తా.. ప్రిపరేషన్ సీక్రెట్ తెలుసా
భారీ షాకిచ్చిన పసిడి.. రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం ధర
భారీ షాకిచ్చిన పసిడి.. రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం ధర
ఆ స్టార్ హీరో సరసన శ్రీనిధి..
ఆ స్టార్ హీరో సరసన శ్రీనిధి..
ప్రేమ, డబ్బు, మీ సొంతం కావాలా.. గులాబీలతో ఈ చిట్కాలు ట్రై చేయండి
ప్రేమ, డబ్బు, మీ సొంతం కావాలా.. గులాబీలతో ఈ చిట్కాలు ట్రై చేయండి
అక్కతో చివరిసారి మాట్లాడిన ఎయిర్‌హోస్టెస్‌ నగాన్తోయ్‌ శర్మ
అక్కతో చివరిసారి మాట్లాడిన ఎయిర్‌హోస్టెస్‌ నగాన్తోయ్‌ శర్మ
మామిడితోటలో పనిచేస్తున్న కూలీలు..పొదల్లో కనిపించిన సీన్‌ చూసి..
మామిడితోటలో పనిచేస్తున్న కూలీలు..పొదల్లో కనిపించిన సీన్‌ చూసి..
ఆఫీసు టేబుల్ మీదే ఆమె ల్యాప్‌టాప్.. ఆమె మాత్రం అనంతలోకాలకు వీడియో
ఆఫీసు టేబుల్ మీదే ఆమె ల్యాప్‌టాప్.. ఆమె మాత్రం అనంతలోకాలకు వీడియో
ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదా? ఆ నష్టాలు తప్పవంతే..!
ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదా? ఆ నష్టాలు తప్పవంతే..!
పెరుగు ఎన్ని రోజుల తర్వాత చెడిపోతుంది? ఫ్రిజ్‌లో ఉంచితే ప్రమాదామా
పెరుగు ఎన్ని రోజుల తర్వాత చెడిపోతుంది? ఫ్రిజ్‌లో ఉంచితే ప్రమాదామా
ఇంటి గేటు ముందు నిల్చున్న వ్యక్తి..ఇంతలో అక్కడికి వచ్చిన ఎద్దు..
ఇంటి గేటు ముందు నిల్చున్న వ్యక్తి..ఇంతలో అక్కడికి వచ్చిన ఎద్దు..