Tollywood: ఏంటీ.. ఈ హీరోయిన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆ..? ఎవరో గుర్తుపట్టారా..
సినీరంగంలో స్టార్ నటీనటులుగా గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఇతర రంగాల్లో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న పలువురు ముద్దుగుమ్మలు.. నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి టాప్ హీరోయిన్లుగా మారారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫాంలో దూసుకుపోతుంది. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. ఒకప్పుడు బ్యాడ్మింటన్ ఛాంపియన్. ఆర్మీ ఫ్యామిలీకి చెందిన ఈ బ్యూటీ.. చిన్నప్పటి నుంచే ఎంతో క్రమశిక్షణతో పెరిగిందట. స్కూల్, కాలేజీ రోజుల్లోనే స్పార్ట్స్ లో ఎక్కువగా పాల్గొనేదట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? పైన ఫోటోను చూశారు కదా. ఆ నలుగురు అమ్మాయిలలో ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఉంది. ఎవరో గుర్తపట్టారా.. ? తనే అందాల తార మీనాక్షి చౌదరి.
1996 మార్చి 5న హర్యానాలో జన్మించింది. తండ్రి సైనికుడు. 2018లో ఫెమినా మిస్ ఇండియా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది. స్కూల్, కాలేజీ రోజుల్లో ఎక్కువగా స్పోర్ట్స్ లో పాల్గొనేదట. రాష్ట్రా స్థాయిలో టెన్నీస్ క్రీడలో పాల్గొందట.. తనను ఓ క్రీడకారిణిగా చూడాలనేది తన తండ్రి కల అని.. కానీ తాను హీరోయిన్ అవుతానని అసలు ఊహించలేదని చెప్పుకొచ్చింది మీనాక్షి. 2021లో సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ సినిమా హిట్ కాలేదు. దీంతో మీనాక్షికి గుర్తింపు రాలేదు. ఈఏడాది హిట్ 2, గుంటూరు కారం చిత్రాలతో హిట్స్ అందుకుంది. దీంతో ఈ అమ్మడుకు తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి.
ఇటీవలే మట్కా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. ఇటీవల దుల్కర్ సల్మాన్, మీనాక్షి జంటగా నటించిన లక్కీ భాస్కర్ సినిమా మాత్రం సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది మీనాక్షి. తెలుగు, తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంటుంది మీనాక్షి. పైన కనిపిస్తోన్న ఫోటో ఫెమినా మిస్ ఇండియా 2018 ఫైనలిస్టులు బెన్నెట్ యూనివర్సిటీ స్పోర్ట్స్ డే ఈవెంట్‌లో పాల్గొన్నప్పటిది.
View this post on Instagram
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.