Tollywood: ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. డైరెక్టర్‏తో ప్రేమ, పారిపోయి పెళ్లి.. ఇప్పుడేం చేస్తుందంటే..

నటిగా సినీరంగంలో తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సినీతారలు ఎంతోమంది ఉన్నారు. అతి తక్కువ సమయంలోనే అద్భుతమైన నటనతో మెప్పించి టాప్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకున్న ముద్దుగుమ్మలు.. పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. ఇప్పుడు సీనియర్ నటి గురించి మాట్లాడుకుందాం.

Tollywood: ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. డైరెక్టర్‏తో ప్రేమ, పారిపోయి పెళ్లి.. ఇప్పుడేం చేస్తుందంటే..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 04, 2024 | 7:15 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ? అతి తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళంలో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేసింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్ తో ప్రేమలో పడి.. ఇంట్లో వాళ్లను ఎదురించి పారిపోయి పెళ్లి చేసుకుంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ దేవయాని. 1990లలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ చాలా ఫేమస్. కథానాయికగా, తల్లిగా, వదినగా కనిపించి మెప్పించింది.

1974 జూన్ 22న ముంబైలో జన్మించిన దేవయాని… తండ్రి కన్నడిగుడు.. తల్లి మలయాళీ. ఆమె సోదరుడు నాఖుల్ తమిళ సినిమాల్లో హీరోగా నటించారు. మరో సోదరుడు మయూర్ సినీరంగంలోకి అడుగుపెట్టనున్నారు. గోయల్ అనే సినిమా ద్వారా హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. కానీ కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. 1993లో విుడదైలన షాట్ బోన్సోమి అనే బెంగాలీ సినిమా ద్వారా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత మరాఠీ, మలయాళీ చిత్రాల్లో నటించింది దేవయాని. 1995 తమిళంలోకి అడుగుపెట్టింది. తమిళంలో అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది.

తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సుస్వాగతం సినిమా ద్వారా ఫేమస్ అయ్యింది. 1995 నుంచి 2000 వరకు దేవయాని బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించింది. కేవలం ఐదేళ్లలో దాదాపు 50 చిత్రాల్లో నటించింది. 2001లో డైరెక్టర్ రాజ్ కుమారన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. డైరెక్టర్ కె.ఎస్ రవికుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రాజ్ కుమారన్ పనిచేస్తున్నప్పుడే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అదే పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే వీరి పెళ్లికి దేవయాని కుటుంబసభ్యులు అడ్డు చెప్పారు. దీంతో ఇంట్లో వాళ్లను ఎదురించి వెళ్లిపోయి తిరుత్తణి మురుగన్ ఆలయంలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న దేవయాని కొన్నాళ్లకు రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు సినిమాల్లో తల్లిగా, వదిన వంటి పాత్రలు పోషిస్తుంది. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్ చేసింది. దేవయానికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. డైరెక్టర్‏తో ప్రేమ, పారిపోయి
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. డైరెక్టర్‏తో ప్రేమ, పారిపోయి
ఏకంగా పదిహేను అడుగులు.. భయంతో స్థానికుల పరుగులు
ఏకంగా పదిహేను అడుగులు.. భయంతో స్థానికుల పరుగులు
ధోనిలా నో లుక్ రనౌట్‌ చేశాడు.. కట్‌చేస్తే.. ఊహించని షాక్..
ధోనిలా నో లుక్ రనౌట్‌ చేశాడు.. కట్‌చేస్తే.. ఊహించని షాక్..
పన్నీరు తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..?
పన్నీరు తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..?
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు..
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు..
అయ్యప్ప భక్తులు బయటపెట్టిన వీడియోలో సంచలన నిజాలు..
అయ్యప్ప భక్తులు బయటపెట్టిన వీడియోలో సంచలన నిజాలు..
అరటి, బొప్పాయిని కలిపి తింటున్నారా..? ఎంత ప్రమాదమంటే..అది విషమే!
అరటి, బొప్పాయిని కలిపి తింటున్నారా..? ఎంత ప్రమాదమంటే..అది విషమే!
దోశ, ఇడ్లీ పిండి పులిసి పోయినా.. ఈ టిప్స్‌తో మళ్లీ వాడుకోవచ్చు..
దోశ, ఇడ్లీ పిండి పులిసి పోయినా.. ఈ టిప్స్‌తో మళ్లీ వాడుకోవచ్చు..
ప్రేక్షకులు లేకుండానే ప్రాక్టీస్.. వెలుగులోకి షాకింగ్ రీజన్
ప్రేక్షకులు లేకుండానే ప్రాక్టీస్.. వెలుగులోకి షాకింగ్ రీజన్
టీమిండియా సెంచరీ ప్లేయర్‌కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.. ఎందుకంటే?
టీమిండియా సెంచరీ ప్లేయర్‌కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.. ఎందుకంటే?