AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Actress: హైదరాబాద్ నిజాం రాజు మనవరాలు.. టాలీవుడ్‏లో క్రేజీ హీరోయిన్.. అవకాశాలు లేక ఇప్పుడు..

సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ బంధువు.. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. తమిళంలో అత్యధిక చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమాల్లోనే ఎక్కువగా కనిపించింది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ?

Telugu Actress: హైదరాబాద్ నిజాం రాజు మనవరాలు.. టాలీవుడ్‏లో క్రేజీ హీరోయిన్.. అవకాశాలు లేక ఇప్పుడు..
Aditi Rao Hydari
Rajitha Chanti
|

Updated on: Jun 16, 2025 | 3:39 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కు దగ్గరి బంధువు. అంతేకాదు.. ఆమె బ్యాగ్రౌండ్ చూస్తే మతిపోవాల్సిందే. హైదరాబాద్ నిజాం అయిన మహ్దమద్ సాహెల్ కబర్ హైదరీ మనవరాలు. అలాగే తెలంగాణలోని వనపర్తి రాజు రామేశ్వర్ రావు మనవరాలు కూడా. తల్లిదండ్రులు ఇద్దరూ చిన్నప్పుడే విడాకులు తీసుకోడంతో తల్లివద్దే పెరిగింది. చిన్న వయసులోనే నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. అయితే కెరీర్ తొలినాళ్లల్లోనే ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ బంధం ఎక్కువరోజులు ఉండలేదు. దీంతో కొన్నాళ్లకే భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టి నటిగా ప్రశంసలు అందుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించిన ఆమె.. ఇటీవలే ఓ స్టార్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పటివరకు దాదాపు 26 సినిమాల్లో నటించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన సినిమాల్లోనే ఎక్కువగా నటించింది. ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ అదితి రావు హైదరీ. ఢిల్లీల 6 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది.

నిన్న ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రితో కలిసి దిగిన చిన్ననాటి ఫోటోలను పంచుకుంది. అదితి రావు హైదరీ… 1986 అక్టోబర్ 28న హైదరాబాద్ లో ఎహసాన్ హైదరీ, విద్యారావు దంపతులకు జన్మించింది. అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కోడలు ఆమె. అదితికి 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తర్వాత అదితిని తన తల్లి ఢిల్లీకి తీసుకెళ్లింది. దీంతో తన కూతురు కస్టడి తనకు ఇవ్వాలంటూ తండ్రి కోర్టును ఆశ్రయించారు. విడాకుల తర్వాత అదితి తల్లి మళ్లీ పెళ్లి చేసుకులేదు.అదితి విద్యాభ్యాసం ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో పూర్తి చేసింది. 2007లో రొమాంటిక్ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

ఆ తర్వాత మలయాళం, తమిళం భాషలలో అధికంగా నటించింది. 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడే సత్యదీప్ మిశ్రాతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. కానీ కొన్నాళ్లకే వీరిద్దరు విడిపోయారు. ఇటీవలే సౌత్ హీరో సిద్ధార్థ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరు కలిసి మహాసముద్రం సినిమాలో నటించారు.

ఇవి కూడా చదవండి :  

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

Tollywood: 2001 విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో.. భుజం విరిగిపోయిన వారందరిని కాపాడి.. చివరకు..

Ramyakrishna: ఆ ఒక్క హీరోకి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ.. ఇంతకీ అతడు ఎవరంటే..

Tollywood: సీరియల్లో పద్దతిగా.. బయట బీభత్సంగా.. ఈ హీరోయిన్ గ్లామర్ ఫోజులు చూస్తే మెంటలెక్కిపోద్ది..