Tollywood: ఆస్ట్రేలియాలో మాస్టర్స్.. జాబ్ వదిలేసి మరీ సినిమాల్లోకి.. ఇప్పుడు ఆ టాలీవుడ్ హీరోకు భార్య కానుంది
బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెబుతూ కొద్ది రోజుల్లేనే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనుందీ టాలీవుడ్ హీరోయిన్. ఓ టాలీవుడ్ హీరోకు భార్యగా, అలాగే ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి ఇంటికి కోడలిగా వెళ్లనుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ పేరు ఇప్పుడు బాగా వినిపిస్తోంది.

పై ఫొటోలో క్యూట్ గా కనిపిస్తున్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడామె టాలీవుడ్ హీరోయిన్. అలాగనీ ఆమె పెద్దగా సినిమాల్లో నటించలేదు. కానీ ఈ అందాల తార పేరు ఇటీవల బాగా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ సొగసరి త్వరలోనే ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి ఇంటికి కోడలిగా వెళ్లనుంది. టాలీవుడ్ ప్రముఖ హీరోతో కలిసి జీవితం పంచుకోనుంది. అయితే పెళ్లికి ముందే ఈ ప్రేమ పక్షులు తెగ తిరగేస్తున్నారు. పండగలు, ఫంక్షన్లు, వెకేషన్లు, సినిమా ఈవెంట్లకు కలిసే వెళుతున్నారు. దీంతో ఈ లవ్ బర్డ్స్ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని రెంట చింతల ప్రాంతానికి చెందిన ఈ అమ్మాయి బ్యాచిలర్ డిగ్రీ వరకు ఇక్కడే చదువుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లి మాస్టర్స్ కూడా పూర్తి చేసింది. కొద్ది రోజుల పాటు అక్కడే ఉద్యోగం కూడా చేసిందట. దీంతో తను ఇంకా పెద్ద పెద్ద జాబ్ లు చేస్తుందని, ఆస్ట్రేలియాలోనే సెటిల్ అయిపోతుందని చాలా మంది భావించారు. కానీ అదేమీ జరగలేదు.
నటనపై మక్కువతో తిరిగి ఇండియాకు వచ్చేసిందీ ముద్దుగుమ్మ. హైదరాబాద్ లో తన సోదరి దగ్గర ఉంటూనే మోడలింగ్ రంగంలో అదృష్టం పరీక్షించుకుంది.. అలాగే సినిమా ఆడిషన్స్ కు హాజరైంది. ఇదే క్రమంలో ఓ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే బ్యాడ్ లక్.. తన మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అయితే ఇప్పుడు ఈ ఫ్లాప్ సినిమానే ఆమెకు స్వీట్ మొమరీలా నిలిచిపోనుంది. ఎందుకంటే ఈ మూవీలో హీరోగా నటించిన అబ్బాయితోనే ప్రేమలో పడిందీ అందాల తార. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారం కూడా లభించడంతో కొన్నినెలల క్రితం నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లో మూడు ముళ్ల బంధంలోకి కూడా అడుగు పెట్టనున్నారు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారో? సుందర కాండ హీరో నారా రోహిత్ కు కాబోయే భార్య, నటి సిరి లేళ్ల.
నారా రోహిత్- సిరి లేళ్ల లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
నారా రోహిత్ నటించిన తాజా చిత్రం సుందరకాండ. మూవీ ప్రమోషన్లలో భాగంగా సోమవారం (ఆగస్టు 26) హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్‌కు నారా రోహిత్ తన కాబోయే భార్య శిరీషాతో కలిసి హజరయ్యారు. తొలిసారి ఈవెంట్‌లో కాబోయే టాలీవుడ్ జంట కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







