Guess Who: శివుడిలా మూడో కన్ను.. ఉగ్రరూపంతో కనిపిస్తోన్న ఈ దిగ్గజ నటుడిని గుర్తు పట్టారా?

పేరుకు బాలీవుడ్ అయినా ఈ దిగ్గజ నటుడికి దేశమంతా అభిమానులు ఉన్నారు. ఎనిమిది పదుల వయసు దాటినా ఇప్పటికీ నిత్యం సినిమా షూటింగులు, టీవీ షోలతో బిజీగా ఉంటారాయన. ఇప్పటికీ దేశంలో అత్యధిక పారితోషకం తీసుకునే నటుల్లో ఆయన కూడా ఒకరు. ఈ నటుడికి తెలుగు రాష్ట్రాల్లోనూ బోలెడు క్రేజ్.

Guess Who: శివుడిలా మూడో కన్ను.. ఉగ్రరూపంతో కనిపిస్తోన్న ఈ దిగ్గజ నటుడిని గుర్తు పట్టారా?
Legendary Actor
Follow us
Basha Shek

|

Updated on: Apr 22, 2024 | 8:33 AM

ముఖం నిండా రక్తపు మరకలు, గుబురు జుట్టు.. శివుడిలా మూడో కన్ను తెరిచి ఉగ్రరూపంతో ఈ నటుడిని గుర్తు పట్టారా? ఆయన భారతదేశం గర్వించ దగ్గ నటుల్లో ఒకరు. పేరుకు బాలీవుడ్ అయినా ఈ దిగ్గజ నటుడికి దేశమంతా అభిమానులు ఉన్నారు. ఎనిమిది పదుల వయసు దాటినా ఇప్పటికీ నిత్యం సినిమా షూటింగులు, టీవీ షోలతో బిజీగా ఉంటారాయన. ఇప్పటికీ దేశంలో అత్యధిక పారితోషకం తీసుకునే నటుల్లో ఆయన కూడా ఒకరు. ఈ నటుడికి తెలుగు రాష్ట్రాల్లోనూ బోలెడు క్రేజ్. అందుకే త్వరలోనే ఒక తెలుగు స్ట్రెయిట్ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. అది కూడా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మూవీతో. ఈ పాటికే అర్థమై ఉంటుంది. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో.. యస్. ఆయన మరెవరో కాదు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్. ఆయన తెలుగులో నటిస్తోన్న చిత్రం కల్కి 2898 AD. ప్రభాస్ హీరోగా నటిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కథానాయికగా కనిపించనుంది. తాజాగా ఈ సినిమాలో బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ పాత్రను పరిచయం చేస్తూ ఒక టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్

ఇందులో యంగ్‌లుక్‌లో కనిపించి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశారు అమితాబ్‌.కల్కి సినిమాలో బిగ్ బీ శిపాత్ర శివుడిని పోలి ఉంటుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అందుకు తగ్గట్టుగానే ఈ టీజర్‌లో అమితాబ్‌కు మూడో కన్ను ఉన్నట్లుగా చూపించడం గమనార్హం. మొత్తానికి లేటెస్ట్ టీజర్ తో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తోన్న ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీలో లోక నాయకుడు కమల్ హాసన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతీ బ్యానర్ మూవీస్ పై అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొదట కల్కి చిత్రాన్ని మే 9వ తేదీన విడుదల చేస్తామని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ కొత్త రిలీజ్‌ డేట్‌పై చిత్ర బృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

ఇవి కూడా చదవండి

కల్కి టీజర్..

అమితాబ్ లుక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.