Tollywood : టాలీవుడ్ దర్శకులపై మనసు పారేసుకుంటున్న బాలీవుడ్ స్టార్స్..
ప్రస్తుతం టాలీవుడ్ పై గట్టిగా ఫోకస్ పెట్టింది బాలీవుడ్.. బాహుబలి సినిమా పుణ్యమా అని తెలుగు సినిమా కీర్తి దేశాలు దాటి పోయింది.
Tollywood : ప్రస్తుతం టాలీవుడ్ పై గట్టిగా ఫోకస్ పెట్టింది బాలీవుడ్.. బాహుబలి సినిమా పుణ్యమా అని తెలుగు సినిమా కీర్తి దేశాలు దాటి పోయింది. దాంతో అన్ని ఇండస్ట్రీలు ఇప్పుడు తెలుగు సినిమా వైపు చూడటం మొదలుపెట్టాయి. ముఖ్యంగా బాలీవుడ్. తెలుగు సినిమాల పై బాలీవుడ్ హీరోలు దృష్టి పెడుతున్నారు. మన సినిమాలను అక్కడ రీమేక్ చేసి భారీ విజయాలను అందుకుంటున్నారు. తెలుగులో మంచి విజయాలను అందుకున్న చాల సినిమాలు ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే.. రీసెంట్ డేస్ లో అర్జున్ రెడ్డి సినిమా బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ అయినా విషయం తెలిసిందే.. ఈ సినిమా తెలుగులో ఎంత విజయం సాధించిందో హిందీలోనూ అదే రేంజ్ లో హిట్ ను అందుకుంది. ఇక ప్రభాస్ సాహో సినిమా అయితే హిందీలోనూ రిలీజ్ అయ్యి కలెక్షన్స్ వర్షం కురిపించింది. దాంతో ఇప్పుడు తెలుగు సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ టాలీవుడ్ డైరెక్టర్స్ వెంట పడటం మొదలుపెట్టారు. సుకుమార్ కు బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ ఆఫర్ ఇచ్చాడని వార్త చక్కర్లు కొడుతుంది. మరోవైపు హరీష్ శంకర్ బాలీవుడ్ లో హీరో సిద్ధార్ధ్ మల్హోత్రాతో `డీజే దువ్వాడ జగన్నాథమ్`ని రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు. అలాగే త్రివిక్రమ్ మ్యాజిక్ `అల వైకుంఠపురములో` చిత్రాన్ని కార్తీక్ ఆర్యన్ హిందీలో `షెహజాదా` పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనితో పాటు నాని జెర్సీ సినిమాను షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కి రెడీగా వుంది. మరో వైపు చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయాన్ని అందుకున్న ఆర్ ఎక్స్ 100 సినిమా కూడా హిందీలో రీమేక్ అవుతుంది. ఇదే కాకుండా మరికొంతమంది బాలీవుడ్ హీరోలు తెలుగు దర్శకులతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :