Gopichand: వరుస సినిమాలతో జోరుమీద టాలీవుడ్ టాల్ హీరో.. గోపీచంద్ మూవీలో విలన్‌గా విలక్షణ నటుడు..
హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో గోపీచంద్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్న గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
Gopichand: హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో గోపీచంద్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్న గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పక్కా కమర్షియల్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా మారుతి మార్క్ కామెడీతో ఉండనుందని అర్ధమవుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్లు, గ్లిమ్ప్స్ సినిమాపై అంచనాలను క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే లక్ష్యం, లౌక్యం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్ – దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.. గోపీచంద్ కెరీర్‌లో 30వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీని పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
వివేక్ కూచిభొట్ల ఈ చిత్రానికి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. విభిన్నమైన జానర్ సినిమాలతో, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించే సంస్థగా ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ హీరో గోపీచంద్‌తో చేస్తున్న తొలి చిత్రం ఇది. ఈ మూవీలో ఒక కీలక పాత్రలో విలక్షణ నటుడు జగపతి బాబు నటించనున్నారు. రీసెంట్ గా జగపతిబాబు బర్త్‌డే సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. లక్ష్యం తర్వాత గోపిచంద్, శ్రీవాస్, జగపతిబాబు ల సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. ఈ చిత్రానికి వెట్రి పళనిస్వామి కెమెరామెన్‌గా వ్యవహరిస్తుండగా మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. భూపతి రాజా కథ, వెలిగొండ శ్రీనివాస్ మాటలు రాశారు. ఈ హ్యాట్రిక్ ప్రాజెక్ట్ మీదున్న అంచనాలకు తగ్గట్టుగా శ్రీవాస్ అదిరిపోయే స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. ఈ చిత్రంలో సరికొత్త లుక్ లో గోపీచంద్ కనిపించనున్నారని తెలుస్తుంది. ఈ మూవీకి సంబందించిన మరిన్నివివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :