AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WI vs SCO : ఈడెన్ గార్డెన్స్‌లో షెపర్డ్ మారణహోమం.. వెస్టిండీస్ ఖాతాలో గ్రాండ్ విక్టరీ

T20 World Cup 2026 WI vs SCO : ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ రోమారియో షెపర్డ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన ప్రాణాంతక బౌలింగ్‌తో స్కాట్లాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. కేవలం హ్యాట్రిక్ సాధించడమే కాకుండా, ఒకే ఓవర్‌లో 4 వికెట్లు పడగొట్టి తన జట్టుకు 35 పరుగుల భారీ విజయాన్ని అందించాడు.

WI vs SCO : ఈడెన్ గార్డెన్స్‌లో షెపర్డ్ మారణహోమం.. వెస్టిండీస్ ఖాతాలో గ్రాండ్ విక్టరీ
T20 World Cup 2026 Wi Vs Sco
Rakesh
|

Updated on: Feb 07, 2026 | 7:00 PM

Share

T20 World Cup 2026 WI vs SCO : ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ రోమారియో షెపర్డ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన ప్రాణాంతక బౌలింగ్‌తో స్కాట్లాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. కేవలం హ్యాట్రిక్ సాధించడమే కాకుండా, ఒకే ఓవర్‌లో 4 వికెట్లు పడగొట్టి తన జట్టుకు 35 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. వెస్టిండీస్ స్టార్ బౌలర్ రోమారియో షెపర్డ్ 2026 టీ20 ప్రపంచకప్‌లో తొలి హ్యాట్రిక్ సాధించిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో షెపర్డ్ ఈ అద్భుతాన్ని చేశాడు. 2వ, 3వ, 4వ బంతుల్లో వరుసగా మ్యాథ్యూ క్రాస్, మైఖేల్ లీస్క్, ఒలివర్ డేవిడ్సన్ వికెట్లను పడగొట్టి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. దీంతో వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ తీసిన తొలి వెస్టిండీస్ బౌలర్‌గా అతను రికార్డు బుక్కుల్లోకి ఎక్కాడు.

ఒకే ఓవర్‌లో 4 వికెట్లు.. 5 వికెట్ల ఘనత

షెపర్డ్ విధ్వంసం హ్యాట్రిక్‌తో ఆగలేదు. అదే ఓవర్ చివరి బంతికి సఫ్యాన్ షరీఫ్‌ను కూడా అవుట్ చేసి, ఒకే ఓవర్‌లో ఏకంగా 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం 3 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసిన షెపర్డ్, స్కాట్లాండ్ బ్యాటింగ్ వెన్నెముకను విరిచేశాడు. అంతకుముందు వెస్టిండీస్ 182 పరుగులు చేయగా, షెపర్డ్ బౌలింగ్ ధాటికి స్కాట్లాండ్ 147 పరుగులకే కుప్పకూలిపోయింది.

హెట్‌మైర్ మెరుపులు.. విండీస్ ఘన విజయం

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తరపున షిమ్రాన్ హెట్‌మైర్ 36 బంతుల్లో 64 పరుగులతో వీరవిహారం చేశాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది క్రిస్ గేల్ 17 ఏళ్ల నాటి రికార్డును కూడా బద్ధలు కొట్టాడు. బ్యాటింగ్‌లో హెట్‌మైర్, బౌలింగ్‌లో షెపర్డ్ రాణించడంతో వెస్టిండీస్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. గ్రూప్-సి లో వెస్టిండీస్ తన ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించి టైటిల్ ఫేవరెట్‌గా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..