Malli Modalaindi : ఎటువంటి వ‌ల్గారిటీ లేదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ‘మళ్ళీ మొదలైంది’ డైరెక్టర్

Malli Modalaindi : ఎటువంటి వ‌ల్గారిటీ లేదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన 'మళ్ళీ మొదలైంది' డైరెక్టర్
T.g. Keerthi Kumar

మళ్ళీ రావా" వంటి బ్లాక్ బస్టర్ తరువాత సుమంత్ ఆచితూచి కథలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన నటించిన తాజా సినిమా ‘మళ్ళీ మొదలైంది’.

Rajeev Rayala

|

Feb 13, 2022 | 9:57 AM

Malli Modalaindi : ‘మళ్ళీ రావా” వంటి బ్లాక్ బస్టర్ తరువాత సుమంత్ ఆచితూచి కథలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన నటించిన తాజా సినిమా ‘మళ్ళీ మొదలైంది’. ఈ సినిమాకు టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి  ఈ సినిమాను నిర్మించారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాను ‘జీ 5’ ఓటీటీ ఎక్స్‌క్లూజివ్‌గా ఈ నెల 11న రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు టీజీ కీర్తి కుమార్ మాట్లాడుతూ ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు. విడాకుల తీసుకున్న జంట క‌థే అయినా తిరిగి వారి జీవితం ఎలా మళ్ళీ మొదలైంది అనేది సినిమా సారాంశం. చాలా సున్నిత‌మైన అంశాన్ని తీసుకుని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో చూపించాం అని తెలిపారు.  తెలుగులో ఇది నా మొద‌టి సినిమా. 2014లో త‌మిళంలో ఒక సినిమా చేశాను. ఆ త‌ర్వాత కొన్ని యాడ్స్ చేశాను. నాది చెన్నై. తెలుగులో సినిమా తీయాల‌నే హైద‌రాబాద్ షిప్ట్ అయ్యాను అని తెలిపారు.

మళ్ళీ మొదలైంది సినిమా నిన్న‌నే ఓటీటీలో వ‌చ్చింది. చూసిన వారంతా చాలా బాగుంద‌ని అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. కొన్నిచోట్ల క్రిటిక్స్ త‌న‌శైలిలో స్పందిస్తున్నారు. ఇది ఫ్యామిలీతో చూసే సినిమా. సుమంత్‌గారికి నాకు ఓ కామెన్ ఫ్రెండ్ వున్నాడు. త‌న ద్వారా క‌థ రాసుకున్నాక సుమంత్ కు సినాప్సిస్ మెయిల్ చేశాను. చ‌దివాక న‌చ్చి పూర్తి క‌థ పంప‌మంటే పంపాను. వెంట‌నే ఆయ‌న చేస్తాన‌న్నారు. ఇది కేవ‌లం ఆయ‌న‌కే చెప్పా. ఏ హీరోకు చెప్ప‌లేదు. రియ‌లిస్టిక్‌గా వ‌య‌స్సురీత్యా క‌థ‌లోని పాత్ర‌కు ఆయ‌న స‌రిపోతాడ‌ని ఆయ‌న‌కే చెప్పాను అని చెప్పుకొచ్చారు కీర్తి. విడాకుల క‌థ ఫ‌స్ట్ లాక్‌డౌన్‌లోనే రాసుకున్నా. ఈ క‌థ‌కు స్పూర్తి నా స్నేహితుడు. అత‌ని జీవితంలో విడాకులు, మ‌ళ్ళీ పెళ్లి సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. ఈ సినిమాలో చూపించిన లాయ‌ర్ పాత్ర వంటివి మాత్రం సినిమాటిక్‌గా పెట్టాం అన్నారు.

స్క్రిప్ట్ రాసే క్ర‌మంలో విడాకులు తీసుకున్న కొన్ని జంట‌ల‌ను క‌లిసి వారినుంచి ఫీడ్ బ్యాక్‌ తీసుకున్నాం. దీన్ని సీరియ‌స్‌గా వ‌ద్దు. కామెడీ ట‌చ్‌తో చేయ‌మ‌ని స‌ల‌హాలు ఇచ్చారు. ఈ క‌థ రిస్క్ వుంటుంద‌నే అనుకున్నాం. ఎందుకంటే అన్ని సెక్ష‌న్ల‌కు చేర‌దు. ఎ,బి ఆడియ‌న్స్‌కు బాగా న‌చ్చుతుంద‌ని భావించాం అన్నారు కీర్తి. ఇందులో ఎటువంటి వ‌ల్గారిటీ లేదు. హాయిగా కుటుంబంతో చూసే సినిమా. ఎవ‌రి మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుని చేశాం. ఈ సినిమాను థియేట‌ర్ కోసమే చేశాం. ఎడిటింగ్ పూర్త‌య్యాక క‌నీసం మ‌ల్లీప్లెక్‌లోనైనా విడుద‌ల చేద్దామ‌ని భావించాం. కానీ క‌రోనా వ‌ల్ల థియేట‌ర్ల ఇబ్బంది కావ‌డంతో ఓటీటీ సేఫ్ అని నిర్మాతలు వెళ్ళారు. అని చెప్పుకొచ్చారు కీర్తి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Amazon Youth Offer: యూత్‌ను టార్గెట్‌ చేస్తూ అమెజాన్‌ కొత్త ఆఫర్‌.. ప్రైమ్‌పై 50 శాతం డిస్కౌంట్‌..

Raviteja vs Rekha: స్టార్ హీరోపై డైరెక్ట్ భార్య సంచలన కామెంట్స్.. ఇంతకీ ఏం జరిగిందంటే..!

Lata Mangeshkar: లతా మంగేష్కర్ కు ఇష్టమైన కొత్తిమీర మటన్ కర్రీ తయారీ విధానం మీ కోసం..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu