Saiee Manjrekar: తెలుగు చిత్రసీమ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం..  హీరోయిన్ సాయి మంజ్రేక‌ర్ కామెంట్స్ వైరల్.. 

మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గని (Ghani). ఈ చిత్రానికి డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు.

Saiee Manjrekar: తెలుగు చిత్రసీమ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం..  హీరోయిన్ సాయి మంజ్రేక‌ర్ కామెంట్స్ వైరల్.. 
Saiee
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 05, 2022 | 4:52 PM

మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గని (Ghani). ఈ చిత్రానికి డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు బాబీ, సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్‏గా నటిస్తోంది. దర్శకుడు, నటుడు, నిర్మాత, రైటర్‌ మహేష్‌ మంజ్రేకర్‌ కూతురు సయీ మంజ్రేకర్‌. `దబాంగ్‌3` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె `గని` సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా ఏప్రిల్‌ 8న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ సాయీ మంజ్రేకర్ మీడియా ప్రతినిధుల‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

టాలీవుడ్ అంటే ప్ర‌త్యేక అభిమానం..

టాలీవుడ్‌లో అల్లు అర్జున్‌, పవన్‌, రామ్‌చరణ్‌ అంటే ఇష్టమని చెప్పారు. తెలుగు సినిమాలు కూడా చూస్తానని, రామ్‌చరణ్‌ నటించిన `మగధీర` ఎంతో బాగా నచ్చిందని, అలాగే బన్నీ నటించిన `పుష్ప` సినిమాకి ఫిదా అయిపోయినట్టు పేర్కొన్నారు. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ ఫాలోయింగ్‌ చూసి ఆశ్చర్యపోయినట్టు తెలిపారు. ఆయన నటించిన `వకీల్‌సాబ్‌` చూశానని తెలిపారు. తెలుగు సినిమాలు హిందీ డబ్బింగ్‌లో చూస్తానని పేర్కోన్నారు. టాలీవుడ్‌పై తనకు మంచి రెస్పెక్ట్ ఉందని చెప్పారు.

తెలుగు సినిమాలు చేస్తా అని ఊహించ‌లేదు..

`గని` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అల్లు అర్జున్‌ని దగ్గరగా చూసి ఆనందానికి లోనయ్యాను, అదొక ఫ్యాన్‌ మూవ్‌మెంట్‌ అని, లోలోపల ఎగిరి గంతేసానని తెలిపారు. ఆ అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేనని వెల్లడించారు. అంతేకాదు `దబాంగ్‌ 3` ప్రమోషన్‌ కోసం హైదరాబాద్‌కి వచ్చినప్పుడు రామ్‌చరణ్‌ని కలవడం గొప్ప ఫీలింగ్‌నిచ్చిందని తెలిపారు సాయి మంజ్రేకర్. ఆ సమయంలో నేను తెలుగు సినిమాలు చేస్తానని అస్సలు ఊహించ లేదని చెప్పారు. తాను అన్నిరకాల పాత్రలు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. తెలుగు, హిందీలోనే కాదు సౌత్‌లో అన్ని భాషల్లోనూ నటించాలని ఉందని, తనకు ఎలాంటి లిమిట్స్ లేవని చెప్పారు. అదే సమయంలో ఎలాంటి కెరీర్‌ ప్లానింగ్‌ కూడా లేదని, వచ్చిన ఆఫర్స్ లో మంచి ప్రాజెక్ట్ లు చేసుకుంటూ వెళ్తానని పేర్కొంది. గ్లామర్‌ షో విషయంలో తాను సిద్ధమే అని, పాత్ర డిమాండ్‌ మేరకు, కథ డిమాండ్‌ మేరకు చేస్తానని వెల్లడించారు. అలియాభట్‌ తనకు ఫేవరేట్‌ యాక్ట్రెస్‌ అని, ఆమె నుంచి ఇన్‌స్పైర్‌ అవుతానని తెలిపారు. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తో క‌లిసి పనిచేయ‌డం ఆనందంగా ఉంద‌ని, వ‌రుణ్ ఓ మంచి కోస్టార్ అని అన్నారు. `గని` సినిమాపై హోప్స్ తో ఉన్నానని, ప్రస్తుతం `మేజర్‌` సినిమాలో నటిస్తున్నానని పేర్కొన్నారు సాయీ మంజ్రేకర్‌.

Also Read: Ram Charan: రామ్‌చరణ్‌ – శంకర్‌ సినిమా నుంచి ఫోటో లీక్‌.. ఆసక్తిరేకెత్తిస్తోన్న చెర్రీ కొత్త లుక్‌..

Ghani Movie: ఆకట్టుకుంటోన్న గని మేకింగ్‌ వీడియో.. వరుణ్‌ డెడికేషన్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌..

Kalyani Priyadarshan : నవ్వే నయాగరం.. చూపే సుమబాణం.. క్యూట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ భామ

OTT & Theater Movies: ఈవారం థియేటర్లు/ఓటీటీలో సందడి చేసే సినిమాలివే.. లిస్టులో మెగా మూవీ..

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
పనస గింజల అద్భుతాలు తెలిస్తే ఇక అస్సలు పడేయరు..శరీరంలో జరిగే ఇదే!
పనస గింజల అద్భుతాలు తెలిస్తే ఇక అస్సలు పడేయరు..శరీరంలో జరిగే ఇదే!
క్యాన్సర్‌ను జయించిన శివన్న.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు
క్యాన్సర్‌ను జయించిన శివన్న.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు
కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..
సైట్ పని చేయకపోయినా ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్..!
సైట్ పని చేయకపోయినా ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్..!
బ్యాంకు ఖాతాలో ఇంత నగదు డిపాజిట్‌ చేస్తున్నారా? జరిమానా పడొచ్చు!
బ్యాంకు ఖాతాలో ఇంత నగదు డిపాజిట్‌ చేస్తున్నారా? జరిమానా పడొచ్చు!
అలర్ట్.. ఈ సీజన్‌‌లో షుగర్ స్థాయి ఎందుకు పెరుగుతుందో తెలుసా?
అలర్ట్.. ఈ సీజన్‌‌లో షుగర్ స్థాయి ఎందుకు పెరుగుతుందో తెలుసా?
భారత రక్షణ వ్యవస్థకు కీలకంగా 2024.. నయా ఆయుధాల ప్రవేశం
భారత రక్షణ వ్యవస్థకు కీలకంగా 2024.. నయా ఆయుధాల ప్రవేశం