OTT & Theater Movies: ఈవారం థియేటర్లు/ఓటీటీలో సందడి చేసే సినిమాలివే.. లిస్టులో మెగా మూవీ..
OTT & Theater Movies: తెలుగు రాష్ట్రాల్లో ఆర్‌ఆర్‌ఆర్ (RRR) ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది. రాజమౌళి తెరకెక్కించిన ఈ ఫిక్షనల్ థ్రిల్లర్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
OTT & Theater Movies: తెలుగు రాష్ట్రాల్లో ఆర్‌ఆర్‌ఆర్ (RRR) ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది. రాజమౌళి తెరకెక్కించిన ఈ ఫిక్షనల్ థ్రిల్లర్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. కాగా ఈ ప్రభంజనాన్ని ముందే ఊహించి గత వారం పెద్ద సినిమాలేవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. కేవలం తాప్సి నటించిన మిషన్ ఇంపాజిబుల్ సినిమా మాత్రమే విడుదలైంది. అయితే ఈ వారం మాత్రం మరో మెగా మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. అదే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గని. దీంతో పాటు రామ్‌గోపాల్ వర్మ డేంజరస్, మరికొన్ని చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇక ఓటీటీ వీక్షకుల కోసం కూడా ఓ కామెడీ ఎంటర్ టైనర్ వెయిట్ చేస్తోంది. మరి ఈవారంలో థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలేంటో తెలుసుకుందాం రండి.
వరుణ్‌తేజ్ ‘గని’
గద్దల కొండ గణేశ్ వంటి సాలిడ్ హిట్ తర్వాత రెండేళ్లకు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. మొదటి నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటోన్న ఈ యంగ్ హీరో ఈసారి బాక్సింగ్ నేపథ్యమున్న స్టోరీని ఎంచుకున్నాడు. ఈక్రమంలో ఆయన బాక్సర్‌గా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గని. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్‌శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతో బన్నీ సోదరుడు అల్లూ బాబీ నిర్మాతగా పరిచయం కానున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాబాయ్ పవన్ కల్యాణ్ నటించిన తమ్ముడు స్ఫూర్తితోనే ఈ సినిమా చేసినట్లు ఇటీవల జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్లో వరుణ్ చెప్పడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. మరి బాక్సర్‌గా మెగా ప్రిన్స్ ఎలా మెప్పిస్తాడో చూడాలంటే ఏప్రిల్ 8 వరకు ఆగాల్సిందే.
వర్మ ‘డేంజరస్’
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మా ఇష్టం(డేంజరస్). అప్సరారాణి, నైనా గంగూలీ మెయిన్ రోల్స్ పోషించారు. స్వలింగ సంపర్కులైన ఇద్దరు మహిళల ప్రేమకథగా సాగే ఈ చిత్రం టాలీవుడ్ లో ఒక కొత్త ప్రయోగమని ఇటీవల వర్మ చెప్పుకొచ్చారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
*వీటితో పాటు రెడ్డిగారింట్లో రౌడీయిజం, బరి, డస్టర్, కథ కంచికి మనం ఇంటికి అనే చిన్న సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.
ఓటీటీలో రాబోతున్న సినిమాలేంటంటే!
ఆహాలో స్టాండప్ రాహుల్
రాజ్‌తరుణ్, వర్ష బొల్లమ్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం స్టాండప్ రాహుల్. శాంటో మెహన వీరంకి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెన్నెల కిశోర్, మురళీశర్మ, ఇంద్రజ తదితరులు కీ రోల్స్ లో నటించారు. నందకుమార్ అబ్బినేని, భరత్ మగులూరి నిర్మించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ మార్చి 18న థియేటర్లలో విడుదలైంది. స్టాండప్ కామెడీతో నవ్వులు పూయించారు. ఇప్పుడు ఓటీటీ వీక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఈనెల 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది ఈ సినిమా.
అమెజాన్ ప్రైమ్ వీడియో
* నారదన్ (మలయాళం)- ఏప్రిల్ 8 * మర్డర్ ఇన్ అగోండా(హిందీ)- ఏప్రిల్ 8
నెట్‌ఫ్లిక్స్
* చస్వీ (హిందీ)- ఏప్రిల్ 7
* ఎత్తర్కుం తునిందావన్ (తమిళ్)- ఏప్రిల్7
* ఎలైట్ (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 8
* మెటల్ లార్డ్స్ (హాలీవుడ్)- ఏప్రిల్ 8
* ద ఇన్‌బిట్విన్ (హాలీవుడ్)- ఏప్రిల్ 8
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
* ద కింగ్స్ మెన్ (హాలీవుడ్) ఏప్రిల్ 8
జీ5
* ఏక్ లవ్ యా(కన్నడ)- ఏప్రిల్ 8
* అభయ్ (హిందీ)- ఏప్రిల్ 8