AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghani Movie: ఆకట్టుకుంటోన్న గని మేకింగ్‌ వీడియో.. వరుణ్‌ డెడికేషన్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌..

Ghani Movie: మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'గని'. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించిన సినిమాపై భారీ అంచనాలున్నాయి. వరుణ్‌ తొలిసారి స్పోర్ట్స్‌ నేపథ్యంలో...

Ghani Movie: ఆకట్టుకుంటోన్న గని మేకింగ్‌ వీడియో.. వరుణ్‌ డెడికేషన్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌..
Ghani Movie
Narender Vaitla
|

Updated on: Apr 05, 2022 | 1:38 PM

Share

Ghani Movie: మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించిన సినిమాపై భారీ అంచనాలున్నాయి. వరుణ్‌ తొలిసారి స్పోర్ట్స్‌ నేపథ్యంలో ఉన్న సినిమాలో నటిస్తుండడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ఫస్ట్‌లుక్‌లు ఆ అంచనాలను ఆకాశానికి అంటేలా చేశాయి. గద్దల కొండ గణేశ్‌ వచ్చి దాదాపు రెండేళ్లు గడుస్తోన్న నేపథ్యంలో వరుణ్‌ ఫ్యాన్స్‌ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఏప్రిల్‌ 8న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇప్పటికే ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించింది చిత్ర యూనిట్‌.

ఈ నేపథ్యంలోనే తాజాగా గని సినిమా మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. షూటింగ్ సమయంలో అల్లు అర్జున్‌తో పాటు అతని సోదరుడు వెంకటేశ్‌ (బాబీ) చేసిన సందడిని ఇందులో చూపించారు. అలాగే బాక్సర్‌గా మారడానికి వరుణ్‌ పడ్డ కష్టానికి ఈ వీడియో అద్దం పడుతోంది. వరుణ్‌ చేసిన కసరత్తులు ఔరా అనిపించేలా ఉన్నాయి. దీంతో ఈ వీడియో చూసిన వరుణ్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాలో వరుణ్‌కు జోడిగా సయీ మంజ్రేకర్‌ నటిస్తోన్న విషయం తెలిసిందే.

ఇక సునీల్‌శెట్టి, ఉపేంద్ర, జగపతిబాబు, నవీన్‌ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు బాబీ, సిద్ధూ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. తమన్‌ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే శ్రోతలను ఆకట్టుకున్నాయి. మరి వరుణ్‌ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే ఏప్రిల్‌ 8 వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Kishan Reddy: ప్రధాని మోదీ చొరవతోనే కట్టడాలకు యునెస్కో గుర్తింపు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

RRR Movie: మరో అరుదైన రికార్డును అందుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌.. ఆ జాబితాలో వన్‌ అండ్‌ ఓన్లీ ఇండియన్‌ మూవీగా..

Perni Nani: ఏపీలో కొత్త మంత్రులపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పేర్ని నాని.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే?

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్