Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: రామ్‌చరణ్‌ – శంకర్‌ సినిమా నుంచి ఫోటో లీక్‌.. ఆసక్తిరేకెత్తిస్తోన్న చెర్రీ కొత్త లుక్‌..

Ram Charan: ట్రిపులార్‌ (RRR) సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం తన తర్వాతి చిత్రంపై దృష్టిసారించాడు. చెర్రీ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో...

Ram Charan: రామ్‌చరణ్‌ - శంకర్‌ సినిమా నుంచి ఫోటో లీక్‌.. ఆసక్తిరేకెత్తిస్తోన్న చెర్రీ కొత్త లుక్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 05, 2022 | 1:59 PM

Ram Charan: ట్రిపులార్‌ (RRR) సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం తన తర్వాతి చిత్రంపై దృష్టిసారించాడు. చెర్రీ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కూడా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇందులో రామ్‌ చరణ్‌కు జోడిగా కియారా అద్వానీ నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా రామ్‌ చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి బయటకు రాగానే మరింత వేగవంతమైంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో చెర్రీ ఐఎస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడని, రాజకీయ వ్యవస్థకు.. ప్రభుత్వ వ్యవస్థకు మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథాంశమని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి లీక్‌ అయిన ఓ ఫోటో ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. అంచనాలే కాకుండా సినిమా కథకు సంబంధించి కూడా పలు అనుమానాలకు కారణంగా మారిందీ ఫోటో.

తాజాగా లీక్‌ అయిన ఫోటోలో చెర్రీ వైట్ కలర్ పంచెలో సైకిల్‌పై వెళుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో రామ్‌ చరణ్‌ ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. అయితే ఈ పాత్ర అచ్చంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సర్పంచ్‌లను పోలి ఉందని. దీంతో రామ్‌చరణ్‌ ఈ సినిమాలో రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడనే చర్చ తెరపైకి వచ్చింది. దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అందరిలోనూ ఆసక్తి పెరిగింది. 1980లో ఫ్లాష్‌ బ్యాక్‌ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు ఉండనున్నాయని తెలుస్తోంది. మరి నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా ఒక్క ఫోటోతో రామ్‌ చరణ్‌-శంకర్‌ల సినిమాపై ఊహగానాలు భారీగా పెరిగాయి.

వైరల్ అవుతోన్న చెర్రీ కొత్త లుక్..

Ram Charan

Also Read: Coolers Below 5k: వేసవి ఉక్కబోతను భరించలేకపోతున్నారా.? రూ. 5 వేల లోపు బెస్ట్‌ కూలర్లపై ఓ లుక్కేయండి..

Ashok Galla : ఈ కుర్ర హీరో మహేష్ బాబు నుంచి నేర్చుకుంది అదేనట.. ఆసక్తికర విషయం చెప్పిన అశోక్..

Sri Lanka Crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభం మధ్య శ్రీలంక కొత్త ఆర్థిక మంత్రిగా అలీ సబ్రీ నియామకం..

భర్త 500 రూపాయలు ఇవ్వలేదని.. అలిగి కిటికీ సన్ షేడ్ ఎక్కిన మహిళ
భర్త 500 రూపాయలు ఇవ్వలేదని.. అలిగి కిటికీ సన్ షేడ్ ఎక్కిన మహిళ
ఇక మేం ఢిల్లీకి రాబోం, మోదీయే మా గల్లీకి రావాలి: సీఎం రేవంత్
ఇక మేం ఢిల్లీకి రాబోం, మోదీయే మా గల్లీకి రావాలి: సీఎం రేవంత్
డీసీసీబి సిబ్బంది అతి.. లోన్ కట్టలేదని గొర్రెలు తీసుకెళ్లారు
డీసీసీబి సిబ్బంది అతి.. లోన్ కట్టలేదని గొర్రెలు తీసుకెళ్లారు
విద్యార్థులను కాపీ కొట్టనివ్వడం లేదని గొడవపడ్డ ప్రిన్సిపల్‌!
విద్యార్థులను కాపీ కొట్టనివ్వడం లేదని గొడవపడ్డ ప్రిన్సిపల్‌!
పాలు తాగిన వెంటనే ఇవి తీసుకోంటే.. యమా డేంజర్ గురూ
పాలు తాగిన వెంటనే ఇవి తీసుకోంటే.. యమా డేంజర్ గురూ
ఏసీని ఎంత ఎత్తులో అమరిస్తే మంచిది..? ఈ పొరపాట్లు చేయకండి!
ఏసీని ఎంత ఎత్తులో అమరిస్తే మంచిది..? ఈ పొరపాట్లు చేయకండి!
పెళ్లి కొడుకు గుట్టు రట్టు చేసిన కాన్ఫ్‌రెన్స్‌ కాల్‌..
పెళ్లి కొడుకు గుట్టు రట్టు చేసిన కాన్ఫ్‌రెన్స్‌ కాల్‌..
విరాట్ కోహ్లీని అచ్చుగుద్దిన తుర్కియే నటుడు.. ఫోటో వైరల్‌
విరాట్ కోహ్లీని అచ్చుగుద్దిన తుర్కియే నటుడు.. ఫోటో వైరల్‌
కన్నయ్య దర్శనం కోసం అనంత్ పాదయాత్ర.. ద్వారకాధీషుడి ఆలయ ప్రాముఖ్యత
కన్నయ్య దర్శనం కోసం అనంత్ పాదయాత్ర.. ద్వారకాధీషుడి ఆలయ ప్రాముఖ్యత
ఆయుధం లేకుండా చేతివేళ్లతో హత్య చేసే మర్మ కళ నేర్చుకున్న దుండగుడు
ఆయుధం లేకుండా చేతివేళ్లతో హత్య చేసే మర్మ కళ నేర్చుకున్న దుండగుడు