Ashok Galla : ఈ కుర్ర హీరో మహేష్ బాబు నుంచి నేర్చుకుంది అదేనట.. ఆసక్తికర విషయం చెప్పిన అశోక్..

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా ఇటీవలే హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Ashok Galla : ఈ కుర్ర హీరో మహేష్ బాబు నుంచి నేర్చుకుంది అదేనట.. ఆసక్తికర విషయం చెప్పిన అశోక్..
Ashok Galla
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 05, 2022 | 11:03 AM

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు(Mahesh Babu) మేనల్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా(Ashok Galla) ఇటీవలే హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. హీరో అనే సినిమా ద్వారా అశోక్ పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో అశోక్ గ‌ల్లాకు న‌టుడిగా మంచి గుర్తింపు వ‌చ్చింది. ఈ సినిమా థియేట‌ర్‌ లోనూ ఓటీటీలోనూ విడుద‌లై న‌టుడిగా త‌న‌కెంతో సంతృప్తినిచ్చింద‌ని అంటున్నారు అశోక్ గ‌ల్లా . ఓటీటీలో వ‌స్తున్న అభినంద‌న‌లు కొత్త ఉత్సాహానిచ్చాయ‌ని తెలియ‌జేస్తూ, తాను చేయ‌బోయే కొత్త సినిమా జూన్‌ లో వెల్ల‌డిస్తాన‌ని పేర్కొన్నారు. తాజాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అశోక్. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. హీరో స‌క్సెస్‌ ను వృత్తిప‌రంగా సంతృప్తి చెందాను. సినిమాలో హీరోగా నిల‌బ‌డాల‌ని అనుకున్న‌ప్పుడు వ‌చ్చిన స‌క్సెస్ ఇది. ఇప్పుడు త‌ర్వాత ఏమి చేయాల‌నేది ఆలోచిస్తున్నాను అన్నారు. అలాగే నేను మంచి క‌థ‌తో రావాల‌నుకున్నాను. ఆ స‌మ‌యంలో అనుకోకుండా శ్రీ‌రామ్ వ‌చ్చి భోజ‌నం టైంలో క‌థ చెప్పారు. అది విన్న‌వెంట‌నే ఇదే క‌దా మ‌నం చేయాల్సింది అనిపించింది. వెంట‌నే ఓకే చెప్పేశాను. ఆ త‌ర్వాత ఆయ‌న ఆఫీస్‌కూడా తీయ‌డం ప‌నులు జ‌ర‌గ‌డం చ‌కచ‌కా జ‌రిగిపోయాయి అన్నారు.

మ‌హేష్‌బాబు సినిమా చూశాక‌.. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు.. అన్నారు. కేవ‌లం ఈ సినిమా గురించే చెప్పారు. అదేవిధంగా కంటిన్యుటీ లో చిన్న‌పాటి త‌ప్పిదాలు వుంటే చెప్పేరు.క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే కాదు. అన్ని జాన‌ర్స్ చేయాల‌నుంది. ఫైటింగ్‌, డాన్స్ అనేది చేయ‌గ‌ల‌ను. న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాల‌న్న‌దే నా కోరిక‌ అన్నారు అశోక్. అదేవిధంగా..నాకు నటనకు స్పూర్తి మ‌హేష్‌బాబు గారే. నేను పెరిగింది ఆయ‌న సినిమాలు చూసే. న‌ట‌న వాతావ‌ర‌ణం అంతా నా చుట్టూనే వుంది. సెల్ప్ బిలీఫ్ అనేది మ‌హేష్‌గారికి బాగా తెలుసు. కాన్‌ఫిడెన్స్ అనేది మ‌నలోనే వుంటుంది. ఇవి ఆయ‌న్నుంచి నేర్చుకున్నా.. మహేష్ సినిమాల్లో మురారి సినిమా అంటే చాలా ఇష్టం. అలాంటి సినిమా మ‌ర‌లా రాలేదు. ముందుముందు కూడా రాదు అంటూ చెప్పుకొచ్చారు అశోక్ గల్లా.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: చక్కనైన కళ్లు.. బూరెబుగ్గలు.. ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు యూత్ ఐకాన్..

Arabic Kuthu: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న ‘అరబిక్ కుతు’ సాంగ్ తెలుగు వెర్షన్.. ఇంతకీ మీరూ విన్నారా ?..

Sarkaru Vaari Paata: మహేష్ బాబు ఫ్యాన్స్‏కు మళ్లి నిరాశేనా !.. సర్కారు వారి పాట వాయిదా ?.. ఇప్పుడిదే హాట్ టాపిక్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!