Ranveer Singh: అల్లు అర్జున్ పాటకు రణ్ వీర్ డ్యాన్స్.. ఊ అంటావా మావా సాంగ్ కు మాస్ స్టెప్పులు.. వీడియో
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప రిలీజై సుమారు మూడేళ్లు గడిచాయి. అయితే ఈ పాన్ ఇండియా మూవీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఫంక్షన్లలోనూ తరచూ పుష్ప పాటలు వినిపిస్తుంటూనే ఉంటాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాటకు
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప రిలీజై సుమారు మూడేళ్లు గడిచాయి. అయితే ఈ పాన్ ఇండియా మూవీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఫంక్షన్లలోనూ తరచూ పుష్ప పాటలు వినిపిస్తుంటూనే ఉంటాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాటకు తనదైన శైలిలో హుషారుగా కాలు కదిపాడు. పుష్ప సినిమాలోని అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా సాంగ్‌కు ఊర మాస్ స్టెప్పులేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే.. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య వివాహ రిసెప్షన్ వేడుకు అత్యంత వైభవంగా జరిగింది. కోలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ శుభ కార్యానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రణ్ వీర్ సింగ్ పుష్ప పాటకు స్టెప్పులేసి ఆహూతులను అలరించారు. అతనికి దేవిశ్రీ ప్రసాద్ కూడా జత కలవడంతో ఇద్దరూ మరింతగా రెచ్చిపోయారు. డైరెక్టర్లు శంకర్, అట్లీ కూడా ఈ వీడియోలో కనిపించడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోను దేవిశ్రీ ప్రసాద్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. దీంతో ఇది కాస్తా వైరల్ గా మారింది.
ఇక సినిమాల విషయానికి వస్తే… రణ్‍వీర్ సింగ్ ప్రస్తుతం సింగం అగైన్ అనే సినిమాలో నటిస్తున్నారు. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తోన్న ఈ మల్టీ స్టారర్ యాక్షన్ డ్రామాలో అజయ్ దేవ్‍గన్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ భారీ మల్టీ స్టారర్ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా అనంతరం హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో రణ్ వీర్ సింగ్ ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. దీనికి రాక్షస్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
పుష్ప పాటకు రణ్ వీర్ సింగ్, దేవి శ్రీ ప్రసాద్ స్టెప్పులు.. వీడియో ఇదిగో..
View this post on Instagram
శంకర్ కూతురి పెళ్లి వేడుకలో సినీ ప్రముఖులు… వీడియో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.