AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: నేను ప్రభాస్‏ను జోకర్ అనలేదు.. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కామెంట్స్..

ఇదంతా పక్కన పెడితే.. తాను చేసిన కామెంట్స్ పై విమర్శలు, ట్రోల్స్ వచ్చినప్పటికీ అర్షద్ వార్సీ ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. కానీ తాజాగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు ఈ బాలీవుడ్ నటుడు. ఇటీవల అబుదాబిలో జరిగిన ఐఫా ఉత్సవంలో పాల్గొన్న అర్షద్ వార్సీకి ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నలు ఎదురయ్యాయి.

Prabhas: నేను ప్రభాస్‏ను జోకర్ అనలేదు.. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కామెంట్స్..
Arshad Warsi, Prabhas
Rajitha Chanti
| Edited By: Ram Naramaneni|

Updated on: Sep 29, 2024 | 10:03 PM

Share

ఇటీవల కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కల్కి 2898 ఏడీ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో ప్రభాస్ లుక్ జోకర్ లా ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దీంతో అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అర్షద్ వార్సీ కామెంట్స్ పై ఇటు ప్రభాస్ ఫ్యాన్స్.. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు, స్టార్ హీరోస్ సీరియస్ అయ్యారు. ప్రభాస్ క్రేజ్ చూసి తట్టుకోలేక ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని.. కల్కి సినిమా గురించి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదంటూ ట్వీట్స్ చేశారు. ఇక మరికొందరు తెలుగు హీరోస్ నేరుగా అర్షద్ వార్సీ పై విమర్శలు చేశారు. ప్రభాస్ సినిమాపై కామెంట్స్ చేయడం వల్లే అర్షద్ వార్సీ పాపులర్ అయ్యారని అన్నారు. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం నెట్టింట అర్షద్ వార్సీని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు.

ఇదంతా పక్కన పెడితే.. తాను చేసిన కామెంట్స్ పై విమర్శలు, ట్రోల్స్ వచ్చినప్పటికీ అర్షద్ వార్సీ ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. కానీ తాజాగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు ఈ బాలీవుడ్ నటుడు. ఇటీవల అబుదాబిలో జరిగిన ఐఫా ఉత్సవంలో పాల్గొన్న అర్షద్ వార్సీకి ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో తన కామెంట్స్ పై అర్షద్ వార్సీ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చాడు. తాను ప్రభాస్ గురించి మాట్లాడలేదని.. కేవలం పాత్ర గురించి మాట్లాడనని అన్నారు.

ఇవి కూడా చదవండి

అర్షద్ వార్సీ మాట్లాడుతూ. “అందరికి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్లకు ఉంటుంది. నేను కేవలం క్యారెక్టర్ గురించి మాత్రమే మాట్లాడను. వ్యక్తి గురించి మాట్లాడలేదు. అతను బ్రిలియంట్ యాక్టర్. అతను ఇది చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నాడు. కానీ బ్యాడ్ క్యారెక్టర్స్ మంచి నటులకు ఇస్తే అడియన్స్ ఒప్పుకోరు” అంటూ చెప్పుకొచ్చాడు. కల్కి 2898 ఏడీ చిత్రానికి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇందులో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కీలకపాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.