Bigg Boss Telugu 9 : లేడీ సింగం అదరగొట్టింది.. రీతూ దెబ్బకు భరణి రేస్ నుంచి అవుట్..
బిగ్ బాస్ సీజన్ 9.. మరికొద్ది రోజుల్లో విజేత ఎవరనేది తెలియనుంది. ఇప్పుడు హౌస్ లో ఫస్ట్ ఫైనలిస్ట్ టికెట్ కోసం పోటీ జరుగుతుంది. గత రెండు రోజులుగా హౌస్మేట్స్ మధ్య వరుస టాస్కులు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు టాస్కులతోపాటు బిహేవియర్ కూడా చాలా ముఖ్యం.

బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు వచ్చేసింది. మొదటి ఫైనలిస్ట్ అయ్యేందుకు బిగ్ బాస్ టాస్క్ లు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఒకొక్కరు అవుట్ అయ్యి.. రేస్ నుంచి తప్పుకుంటుంటున్నారు. కాగా ఇప్పటికే కొందరు ఈ రేస్ నుంచి తప్పుకున్నారు. కాగా ఎవ్వరూ ఊహించని విధంగా రీతూ చౌదరి టాస్క్ ల్లో ఇరగదీస్తోంది. రీతూ ఏకంగా కళ్యాణ్-ఇమ్మానుయేల్‌ని ఓడించింది. ఇప్పుడు ఒక్క అడుగు దూరంలో ఉంది ఈ అమ్మడు. తాజాగా వదిలిన ప్రోమోలో రీతూ చౌదరి భరణితో పోటీపడింది. ఇప్పటికే రేసు నుంచి సంజన, తనూజ, డీమాన్, సుమన్ అవుట్ అయ్యారు. మరోవైపు ఇమ్మానుయేల్, కళ్యాణ్, రీతూ చౌదరి, భరణి మాత్రమే రేసులో ఉన్నారు. తాజాగా వదిలిన ప్రోమోలో రీతూ, భరణి పోటీపడ్డారు.
ఈ ఇద్దరికీ రింగ్ మాస్టర్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.. గార్డెన్ ఏరియాలో ఓ చెత్త కుప్ప ఏర్పాటు చేసి. దాంట్లో దాగి ఉన్న మూడు ట్రయాంగిల్స్, మూడు స్క్వేర్స్, మూడు సర్కిల్స్‌ని ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేయాలి అని చెప్పాడు. అలాగే ఒక లైన్ పూర్తయిన తర్వాత ప్లేయర్లు ఒక రింగ్ తీసుకొని పోల్‌కి హ్యాంగ్ అయ్యేలా విసరాలి.. ఎవరైతే ముందుగా ఈ టాస్క్ పూర్తి చేస్తారో వారే విన్ అయ్యినట్టు చెప్పాడు. దాంతో రీతూ భరణి పోటాపోటీగా టాస్క్ ఆడారు.
రీతూకి డిమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్ సపోర్ట్ చేశారు. అలాగే భరణికి తనూజ సపోర్ట్ చేసింది. జాగ్రత్త నాన్న అంటూ సపోర్ట్ చేసింది. అయితే ఈ టాస్క్ లో రీతూ విన్ అయినట్టు తెలుస్తుంది. రీతూ సరిగ్గా పెట్టలేదు అని భరణి సంచలక్ గా ఉన్న సంజనతో వాదించడం చూపించారు. టాస్క్ అయిపోయిన తర్వాత రీతూ పెట్టింది ఒకటి ట్రయాంగిల్ కాదు అంటూ తనూజ మొదలు పెట్టింది. దాంతో భరణి కూడా అది ట్రైయాంగిల్ కాదు అని సంజనతో వాదించాడు. మరి ఏం జరిగిందో నేటి ఎపిసోడ్ లో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .




