Gangavva Flight Journey: ‘గంగవ్వ విమానం ఎక్కితే..’ ఫస్ట్‌ టైం ఫ్లైట్‌ ఎక్కిన గంగవ్వ ముచ్చట్లు

మన గంగవ్వ మొట్టమొదటిసారిగా విమానం ఎక్కింది. తొలిసారి విమానం ఎక్కితే ఎవరికైనా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. గంగవ్వ కూడా మస్తు హుషారెత్తిపోయింది. 'మేం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పుకోండి'.. అనే క్యాఫ్షన్‌తో విమానం ఎక్కబోయే ముందు

Gangavva Flight Journey: 'గంగవ్వ విమానం ఎక్కితే..' ఫస్ట్‌ టైం ఫ్లైట్‌ ఎక్కిన గంగవ్వ ముచ్చట్లు
Gangavva Flight Journey
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 17, 2023 | 6:26 PM

మన గంగవ్వ మొట్టమొదటిసారిగా విమానం ఎక్కింది. తొలిసారి విమానం ఎక్కితే ఎవరికైనా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. గంగవ్వ కూడా మస్తు హుషారెత్తిపోయింది. ‘మేం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పుకోండి’.. అనే క్యాఫ్షన్‌తో విమానం ఎక్కబోయే ముందు ఫొటో తీసుకుని ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేసింది. ‘శివరాత్రి సంబరాలకు ఈషా ఫౌండేషన్ సద్గురుగారి దగ్గరకు వెళ్తున్నారు కదా.. సేఫ్ జర్నీ.. హ్యాపీ జర్నీ..’ అంటూ కామెంట్‌ సెక్షన్‌లో పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. అందరూ కలలు కంటారు.. అడ్డంకులను అధిగమిస్తూ కొందరే వాటిని సాకారం చేసుకుంటారు. తెలంగాణ ఎక్కడో మారుమూల గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించే 62 ఏళ్ల గంగవ్వ ‘మై విలేజ్’ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. తెలంగాణ యాసలో.. అచ్చ తెలుగు పదాలు వల్లిస్తూ.. పల్లె జీవనానికి సంబంధించిన వీడియోలు చేస్తూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా భారీగా పాపులారిటీ సొంతం చేసుకోవడమేకాకుండా అనతి కాలంలోనే సెలబ్రిటీల లిస్టులో చేరిపోయింది.

వృద్ధాప్యంలో మేమేం చేయగలం అనుకునే వారికి గంగవ్వ జీవశైలి ఓ ఆదర్శంగా, ఓ రోల్‌మోడల్‌గా చెప్పుకోవచ్చు. తన జీవితంలో విమానం ఎక్కుతుందని కూడా గంగవ్వ ఊహించి ఉండదు. గంగవ్వ చేసే వీడియోలకు కేవలం గంటల వ్యవధిలోనే మిలియన్లలో వ్యూస్‌ వస్తుంటాయి. ఏకంగా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్‌ సీజన్‌-4 నుంచే పిలుపొచ్చిందంటే గంగవ్వ క్రేజ్‌ ఏపాటిదో అర్ధం చేసుకోండి. ఈమెకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అభిమానులుగా మారిపోయారు. ఇక బిగ్‌బాస్ షో తర్వాత పాపులారిటీ సొంతం చేసుకున్న గంగవ్వకు ఆర్థికంగా బాగా స్థిరపడటమే కాకుండా తన సొంత ఇంటి కలను (రూ.7 లక్షలు) కూడా నెరవేర్చుకున్నారు. గంగవ్వ క్రేజ్ చూసిన కొందరు దర్శక నిర్మాతలు పలు సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా కల్పించారు. సాధారణంగా చిన్నచిన్న క్యారెక్టర్‌ ఆర్టిస్టులకు నిర్మాతలు ప్రత్యేకంగా కారవ్యాన్ సదుపాయం కల్పించరు. గంగవ్వకు మాత్రం ప్రత్యేకంగా కారవ్యాన్ కూడా కల్పించినట్లు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్వయంగా గంగవ్వ వెల్లడించింది. యూట్యూబ్‌ వీడియోలతోపాటు షార్ట్‌ ఫిల్మ్‌లలో నటిస్తున్న గంగవ్వ ఒక్క రోజు షూటింగ్‌కు పది వేల రూపాయల వరకు తీసుకుంటుందట.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే