TSPSC Group 2: టీఎస్పీయస్సీ గ్రూప్ 2కు 5.51 లక్షల దరఖాస్తులు.. వారం రోజుల్లో పరీక్ష తేదీ ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీయస్సీ గ్రూప్-2 ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ గురువారం (ఫిబ్రవరి 16) సాయంత్రం 5 గంటలతో ముగిసింది. మొత్తం 783 పోస్టులకుగానూ..
తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీయస్సీ గ్రూప్-2 ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ గురువారం (ఫిబ్రవరి 16) సాయంత్రం 5 గంటలతో ముగిసింది. మొత్తం 783 పోస్టులకుగానూ రాష్ట్రవ్యాప్తంగా 5,51,901 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 18 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభంకాగా చివరి మూడు రోజుల్లోనే 1.10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గత 24 గంటల్లోనే 68 వేలకు పైగా దరఖాస్తులు రావడం గమనార్హం. ఈ లెక్కన చూస్తే ఒక్కో పోస్టుకు సగటున 705 మంది చొప్పున పోటీపడనున్నారు.
ప్రస్తుతం గ్రూప్-2 దరఖాస్తు గడువు ముగియడంతో పరీక్ష తేదీ ఖరారుపై టీఎస్‌పీఎస్సీ సమాలోచనలు చేస్తోంది. గ్రూప్-2 ఉద్యోగ నోటిఫికేషన్‌లో రాతపరీక్ష ఎప్పుడనేది పేర్కొనలేదు. దరఖాస్తు ప్రక్రియ ముగిసినప్పటికీ పరీక్ష తేదీలను మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు. పరీక్ష తేదీపై వచ్చేవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.