Health Tips: తక్కువ ధరకు దొరికే ఈ ధాన్యంతో వండిన అన్నం రోజుకో కప్పు తిన్నారంటే..

నేటి కాలంలో చిన్నా.. పెద్ద.. తేడాలేకుండా గుండెజబ్బులు, డయాబెటిస్‌ వంటి పెద్ద వ్యాధులు అన్ని వయసుల వారికి వస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం ఆహారం, జీవశైలి. దీంతో ప్రతిఒక్కరిలో ఆరోగ్యంపై..

Health Tips: తక్కువ ధరకు దొరికే ఈ ధాన్యంతో వండిన అన్నం రోజుకో కప్పు తిన్నారంటే..
Quinoa
Follow us

|

Updated on: Feb 16, 2023 | 6:52 PM

నేటి కాలంలో చిన్నా.. పెద్ద.. తేడాలేకుండా గుండెజబ్బులు, డయాబెటిస్‌ వంటి పెద్ద వ్యాధులు అన్ని వయసుల వారికి వస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం ఆహారం, జీవశైలి. దీంతో ప్రతిఒక్కరిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. బియ్యం బదులు తృణధాన్యాల వైపు అధిక మంది మొగ్గుచూపుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీ ఆహారంలో కొన్ని తృణధాన్యాలు చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సైతం సూచిస్తున్నారు. ధర తక్కువ, పోషకాలు అధికంగా ఉండే తృణధాన్యాల్లో క్వినోవా మంచి ఎంపిక. వీటిని వింటర్ సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. క్వినోవాలో ఫైబర్, విటమిన్ బి, విటమిన్ ఇ, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిలోని పోషకాలు గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తాయి. క్వినోవాలోని ప్రొటీన్‌లు, అమైనో ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటితోపాటు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

దీనిలోని ఫైబర్ కంటెంట్‌ మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు దూరం చేస్తుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను సైతం క్వినోవా దరిచేరకుండా రక్షణ కల్పిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారంలో భాగంగా క్వినోవా తినడం వల్ల ఆర్థరైటిస్, పెలుసు ఎముకల ప్రమాదాన్ని నివారించి ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. రక్తహీనత సమస్యకు చెక్‌ పెట్టవచ్చు. రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు ఊడికించిన క్వినోవా రైస్‌ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు వనకూరుతుంది. సాధారణంగా దీనితో ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఒక్కోసారి క్వినోవా తిన్న తర్వాత కడుపునొప్పి, దురద, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అటువంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వీటిని తీసుకోకపోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి