TSPSC DL Application Last Date: తెలంగాణ డిగ్రీ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 544 అసిస్టెంట్ ప్రొఫెసర్లు (లెక్చరర్లు), ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ గడువును..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 544 అసిస్టెంట్ ప్రొఫెసర్లు (లెక్చరర్లు), ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీయస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 31 నుంచి ప్రారంభమయ్యాయి. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 20 చివరి తేదీగా పేర్కొన్నారు. ఐతే తాజాగా దరఖాస్తు గడువును మార్చి 20 వరకు పొడిగించినట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటన విడుల చేసింది. పరిపాలన సంబంధిత కారణాల వల్ల దరఖాస్తు చివరి తేదీలో మార్పు చేసినట్లు కమిషన్ ఈ మేరకు స్పష్టం చేసింది. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల్లో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 29 ఉండగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఆయా సబ్జెక్టుల వారీగా ఇలా ఉన్నాయి..
- ఇంగ్లీష్ పోస్టులు: 23
- తెలుగు పోస్టులు: 27
- ఉర్దూ పోస్టులు: 2
- సంస్కృతం పోస్టులు: 5
- స్టాటిస్టిక్స్ పోస్టులు: 23
- మైక్రో బయాలజీ పోస్టులు: 5
- బయో టెక్నాలజీ పోస్టులు: 9
- అప్లైడ్ న్యూట్రిషన్ పోస్టులు: 5
- కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ పోస్టులు: 311
- బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పోస్టులు: 39
- కామర్స్ బిజినెస్ అనలిటిక్స్ పోస్టులు: 8
- డైరీ సైన్స్ పోస్టులు: 8
- క్రాప్ ప్రొడక్షన్ పోస్టులు: 4
- డేటా సైన్స్ పోస్టులు: 12
- ఫిషరీస్ పోస్టులు: 3
- కామర్స్-విదేశీ వాణిజ్యం పోస్టులు: 1
- కామర్స్ ట్యాక్సేషన్ పోస్టులు: 6
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.