NIT Recruitment 2023: నిట్ జలంధర్‌లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకుపైగా జీతం..
జలంధర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్).. 105 టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, స్టెనోగ్రాఫర్, సీనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, ఆఫీస్ అటెండెంట్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల..
జలంధర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్).. 105 టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, స్టెనోగ్రాఫర్, సీనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, ఆఫీస్ అటెండెంట్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్స్‌టైల్ టెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్/బీఈ/డిప్లొమా/ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తుదారుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో మార్చి 1, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.1000లు, ఎస్సీ/ఎస్టీ ఇతర కేటగిరీ అభ్యర్ధులు రూ.500లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. స్క్రీనింగ్/స్కిల్/రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.18,000ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.