Ashu Reddy: నెటిజన్ అత్యుత్సాహం.. ఆ ప్రశ్న అడగ్గానే చెప్పు చూపించిన అషూరెడ్డి.. ఇంతకీ ఏమైందంటే?
సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ నిత్యం తన గ్లామర్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. అదేవిధంగా తీరిక దొరికినప్పుడల్లా సామాజిక మాధ్యమాల వేదికగా నెటిజన్లతో ముచ్చటిస్తుంటుంది.
అషూరెడ్డి.. బుల్లితెర ప్రేక్షకులు, సోషల్ మీడియా యూజర్లకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. డబ్‌స్మాష్ వీడియోలతో జూనియర్ సామ్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ బిగ్‌బాస్ షోతో మరింత క్రేజ్ సొంతంత చేసుకుంది. ఈ టాక్‌షో తర్వాత టీవీ షోలు, సినిమాలతో బిజీగా మారిపోయింది ముద్దుగుమ్మ. ఇక ఆ మధ్యన ఆర్జీవీ బోల్డ్ ఇంటర్వ్యూలతో తెగ వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ నిత్యం తన గ్లామర్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. అదేవిధంగా తీరిక దొరికినప్పుడల్లా సామాజిక మాధ్యమాల వేదికగా నెటిజన్లతో ముచ్చటిస్తుంటుంది. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానాలిస్తుంటుంది. కాగా తాజాగా నెటిజన్లతో మరోసారి మాట కలిపింది అషూరెడ్డి. #Ask me a question అంటూ ఛాట్ చేసింది. ఈ సందర్భంగా తన ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌కు సంబంధించి నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా ఆన్సర్స్ ఇచ్చింది.
ఇదే క్రమంలో ఓ నెటిజన్ అత్యుత్సాహం చూపించాడు. ‘ఈ మధ్య నీకు ఓవరాక్షన్ బాగా ఎక్కవైనట్లు అనిపించడం లేదా? అని అడిగాడు. దీనికి స్పందించిన అషూ రెడ్డి.. ‘ అవును కానీ ఈ మధ్యే కాస్త తగ్గింది’ అని కౌంటర్ ఇస్తూనే చెప్పు ఉన్న ఎమోజీని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా టీవీ షోలతో పాటు అప్పుడప్పుడూ వెండితెరపైనా మెరుస్తోంది. కొన్నిరోజుల క్రితం ఫోకస్ అనే సినిమాలో నటించిన అషూరెడ్డి మరికొన్ని చిత్రాలకు ఓకే చెప్పింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..