AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

James Cameron : కథను చెప్పడంలో రాజమౌళి షేక్‏స్పియర్.. జక్కన్నపై జేమ్స్ కామెరూన్ ప్రశంసలు..

టైటానిక్, అవతార్, అవతార్ 2 వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కామెరూన్ ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకలలో రాజమౌళిని కలుసుకున్నారు.

James Cameron : కథను చెప్పడంలో రాజమౌళి షేక్‏స్పియర్.. జక్కన్నపై జేమ్స్ కామెరూన్ ప్రశంసలు..
Rajamouli
Rajitha Chanti
|

Updated on: Feb 12, 2023 | 7:11 PM

Share

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం సృష్టించిన ప్రభంజనం గురించి చెప్పక్కర్లేదు. యావత్ ప్రపంచమే ఈ సినిమాకు ఫిదా అయ్యింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన అద్భుతమంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. రూ. 400 కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది. అలాగే ఈ సినిమాపై జక్కన్న టెకింగ్ పై హాలీవుడ్ డైరెక్టర్స్ పొగడ్తలు కురిపించారు. తాజాగా మరో హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. టైటానిక్, అవతార్, అవతార్ 2 వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కామెరూన్ ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకలలో రాజమౌళిని కలుసుకున్నారు. జక్కన్న టేకింగ్.. ఆయన మేధావి కథనం.. పాత్రలను నడిపించే భావోద్వాగాలపై ప్రశంసలు కురిపించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి మాట్లాడారు. “ఇది నిజంగా చాలా గొప్ప విజయం. ఆర్ఆర్ఆర్ ఎంతో అద్భుతమైన చిత్రం. నేను మొదటిసారి ఈ సినిమా చూసి ఆశ్చర్యపోయాను. సినిమా అంటే కేవలం గ్రాఫిక్స్ మాత్రమే కాదు.. కథ చెప్పడంలో రాజమౌళి షేక్స్పియర్… క్లాసిజం ఉంది. ఇందులో రామ్ చరణ్ పాత్ర.. నటన మరో స్థాయిలో ఉంది. రాజమౌళితో వీటన్నిటి గురించి వివరంగా మాట్లాడాలనుకున్నాను.. కానీ అతడిని కలిసినప్పుడు అంత సమయం దొరకలేదు. అందుకే సరిగ్గా మాట్లాడలేకపోయాను. ఈ సినిమా గురించి అతడితో ఇంకా మాట్లాడాలని నేను అనుకుంటున్నాను ” అంటూ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు కోసం పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం చారిత్రాత్మక చిత్రం 28వ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో ‘ఉత్తమ విదేశీ భాషా చిత్రం’, ‘ఉత్తమ పాట’ అవార్డ్స్ కూడా గెలుచుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి