Bigg Boss 9 Telugu : హౌస్లోకి ఫ్యామిలీ ఎంట్రీ.. పిల్లల్ని చూడగానే సంజన ఎమోషనల్..
బిగ్‌బాస్ సీజన్ 9లో రావడంతో గుడ్డు దొంగిలించి అందరినీ ముప్పుతిప్పలు పెట్టింది సంజన. షో స్టార్ట్ అయిన మొదటివారమే గొడవలతో అందరి దృష్టిలో పడింది. అయితే ఈవారం హౌస్ లో ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయినప్పటి నుంచి సంజన కుటుంబం గురించి జనాలు ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు అడియన్స్ ఎక్కువగా వెయిట్ చేస్తున్న సంజన ఫ్యామిలీ ప్రోమో వచ్చేసింది.

బిగ్‌బాస్ సీజన్ 9లో ఇప్పుడు ఫ్యామిలీ వీక్ రన్ అవుతుంది. ఇప్పటికే తనూజ, సుమన్ శెట్టి ఫ్యామిలీస్ ఇంట్లోకి అడుగుపెట్టారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో డీమాన్ పవన్ తల్లి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వీక్ లో మరో సూపర్ ప్రోమో రివీల్ చేశారు. మొదటి నుంచి నో ఫ్యామిలీ వీక్ అంటూ సంజనను ఏడిపించిన బిగ్‌బాస్.. ఇప్పుడు ఆమె కుటుంబాన్ని హౌస్ లోకి పంపించి ఆమె కళ్లల్లో సంతోషాన్ని నింపారు. తాజాగా విడుదలైన సంజన ఫ్యామిలీ ప్రోమో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో సంజన ఫ్రీజ్ అంటూ ప్రోమో మొదలైంది. దీంతో ఆమె ఫ్రీజ్ లో ఉండగానే తన పిల్లల్ని తీసుకుని సంజన భర్త లోపలికి ఎంట్రీ ఇచ్చారు.
భర్త, పిల్లలను చూడగానే సంజన ఎమోషనల్ అయ్యింది. తన కూతురిని చూసి ఇది చూడటానికి నాగులానే ఉంది అంటూ మురిసిపోయింది. మరోవైపు సంజన కొడుకు ఇమ్మూ చేతికి ముద్దు పెట్టాడు. దీంతో అందరు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత సంజన కొడుకుని ఎత్తుకుని ఇల్లంతా తిప్పుతూ ఇమ్మాన్యుయేల్ సంతోషపడ్డాడు. ‘నువ్వు ఉండిపోరా… మీ అమ్మను పంపించేసి.. మీ అమ్మ అందరితో గొడవలు పడిందిరా తమ్ముడా.. ఏం చెప్పలేక పోతున్నానురా తమ్ముడా అమ్మకు.. నువ్వన్నా చెప్పు.. వెళ్లేటప్పుడు సరేనా ‘ అని ఇమ్మాన్యుయేల్ చెప్పడంతో ఓకే అంటూ సంజన కొడుకు చెప్పాడు.
ఇక తర్వాత షో ఎలా ఉంది.. ?నేను ఎక్కువ కోప్పడుతున్నానా ? అని అడగడంతో.. చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నావ్ అని చెప్పాడు. తర్వాత అదే మాటను ఇమ్మూకు చెప్పడంతో అవునా అంటూ ఆశ్చర్యపోయాడు. అక్కడ కోపపడేదాంట్లో 10 శాతం కూడా లేదు అని సంజన భర్త బదులిచ్చాడు. ఏంటీ.. 10 పర్సెంట్ కే ఇంటిని అతలాకుతలం చేసేస్తున్నావ్ అంటూ ఇమ్మూ షాకయ్యాడు. ఇక తర్వాత గార్డెన్ ఏరియాలో ఉన్న కెప్టెన్ ఫోటోల బోర్డులు చూడగానే అమ్మ ఎక్కడుంది అంటూ సంజన అడిగింది. ఇదిగో అమ్మ ఇక్కడే ఉంది అంటూ సంజన కొడుకు వెళ్లి ఫోటో మీద ముద్దుపెట్టాడు. ఆ సీన్ చూడగానే హౌస్ లో ఉన్నవాళ్లందరూ ఎమోషనల్ అయ్యారు.
ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..




