AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఓయ్’ హీరోయిన్‌ను గుర్తు చేస్తోన్న ‘రాకాస’ డైరెక్టర్.. ఇంతకీ ఎవరీ మానస శర్మ? గతంలో ఏయే సినిమాలు చేసింది?

గతంలో పలు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లను తెరకెక్కించిన మానస శర్మ 'రాకాస' కథను కూడా వెబ్ సిరీస్ గా రూపొందించాలనుకున్నారట. ఇందుకోసం ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ నుంచి ఆఫర్ కూడా వచ్చిందట. అయితే కొన్ని కారణాలతో మానస తన మనసు మార్చుకుందట.

'ఓయ్' హీరోయిన్‌ను గుర్తు చేస్తోన్న 'రాకాస' డైరెక్టర్.. ఇంతకీ ఎవరీ మానస శర్మ? గతంలో ఏయే సినిమాలు చేసింది?
Rakasa Movie Director Manasa Sharma
Basha Shek
|

Updated on: Apr 01, 2026 | 6:55 PM

Share

విజయ నిర్మల, జీవితా రాజశేఖర్, సుధా కొంగర, బి.జయ, బీ.వీ.నందిని రెడ్డి.. ఇలా దక్షిణాదిలో లేడీ డైరెక్టర్లు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో పేరు చేరింది. ఆమేనే మానస శర్మ. గతంలో పలు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లను తెరకెక్కించిన ఆమె ఇప్పుడు రాకాస సినిమాతో డైరెక్టర్ గా అదృష్టం పరీక్షించుకోనున్నారు. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఈ లేడీ డైరెక్టర్ పేరు తెగ వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ మానస శర్మ పేరు మార్మోగిపోతోంది. ఇక సినిమా ప్రమోషన్లలో ఆమె మాట తీరు చూస్తుంటే ఈమె డైరెక్టరా లేక హీరోయినా అనే సందేహం కలగక మానదు. మొన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈమెను చూసి ఒకరు ‘ఓయ్’ సినిమా హీరోయిన్ షామిలీలా కనిపిస్తోందన్నారు. నిజంగానే మానస శర్మ మాటతీరు, అమాయకత్వం, అందం చూసి చాలా మంది ఫిదా అవుతున్నారు. కేవలం డైరెక్షనే కాదు, హీరోయిన్‌గా కూడా ట్రై చేయవచ్చు కదా అని సలహాలు ఇస్తున్నారు. మరి ఇప్పుడు పుల్ ట్రెండింగ్ లో ఉన్న ఈ మానస శర్మ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం రండి.

ఇవి కూడా చదవండి

మానస శర్మది శ్రీకాకుళం. ఆమె ప్రయాణం యూట్యూబ్ నుంచి మొదలైంది. 2019లో నిహారిక ప్రొడక్షన్ కంపెనీలో ‘మ్యాడ్ హౌస్’ అనే యూట్యూబ్ సిరీస్‌కు రైటర్‌గా పనిచేసింది మానస. ఆ తర్వాత ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్ కు క్రియేటర్‌గా, రచయితగా వర్క్ చేసి తన ట్యాలెంట్ ను ప్రూవ్ చేసింది. ఇక ఈ మధ్యనే వచ్చిన ‘బెంచ్ లైఫ్’ వెబ్ సిరీస్‌తో డైరెక్టర్‌గా మారింది. సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇలా షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లతో ఇప్పటికే తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మానస. ఇప్పుడు రాకాస సినిమాతో వెండి తెరపై కూడా అదృష్టం పరీక్షించుకోనుంది. సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 03న విడుదల కానుంది. నిహారిక ఈ సినిమాను నిర్మించింది.

‘రాకాస’ సినిమా ప్రమోషన్లలో మానస శర్మ..

View this post on Instagram

A post shared by YouWe Media (@youwemedia)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం