AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!

ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో గజకేసరి, చంద్రమంగళ యోగాలు ఏకకాలంలో ఏర్పడుతున్నాయి. పౌర్ణమి ప్రభావంతో చంద్రుడు పూర్ణబలంతో ఉండగా, గురు, కుజులు కేంద్రస్థానాల్లో ఉండటం వల్ల అధికార, ఆదాయ వృద్ధికి ఇది అత్యంత అనుకూల సమయం. ఈ మూడు రోజుల్లో ప్రారంభించే పనులు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా వృషభం, మిథునం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారికి అదృష్టం కలిసివస్తుంది.

ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!
Rare Yogas
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 01, 2026 | 6:58 PM

Share

ఈ నెల (ఏప్రిల్) 2, 3, 4 తేదీల్లో ఏక కాలంలో గజకేసరి, చంద్రమంగళ యోగాలు ఏర్పడుతున్నాయి. పౌర్ణమి కారణంగా పూర్ణ బలంతో ఉన్న చంద్రుడికి గురువు, కుజుడు కేంద్ర స్థానాల్లో ఉన్నందువల్ల ఈ రెండు అధికార, ఆదాయ వృద్ధి యోగాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రెండు యోగాల వల్ల కొన్ని రాశుల వారు ఆదాయ వృద్ధి ప్రయత్నాలు చేపట్టడానికి, పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఈ మూడు రోజుల్లో చేపట్టే ఏ ప్రయత్నమైనా సమీప భవిష్యత్తులో తప్పకుండా సక్సెస్ అవుతుంది. వృషభం, మిథునం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశులు నక్క తోకను తొక్కబోతున్నాయి.

  1. వృషభం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో గురు, చంద్రుల కేంద్ర స్థితి వల్ల గజకేసరి యోగం, లాభ స్థానంలో ఉన్న కుజుడితో చంద్రుడికి సమ సప్తమం ఏర్పడడం వల్ల చంద్ర మంగళ యోగం ఏర్పడ్డాయి. ఈ రెండు యోగాల వల్ల ఒకటికి రెండుసార్లు మహా భాగ్య యోగాలు పట్టే అవకాశం ఉంది. తప్ప కుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల మంచి ధన లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది.
  2. మిథునం: ఈ రాశిలో ఉన్న గురువుతో గజకేసరి యోగం, దశమంలో ఉన్న కుజుడితో చంద్ర మంగళయోగం ఏర్పడడం వల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. అనేక విధాలుగా ధన లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు అంచనాలను మించి లాభిస్తాయి. ఆస్తి లాభం, భూ లాభం కలుగుతుంది. జీతభత్యాలు పెరగడం, లాభాలు వృద్ధి చెందడం వంటివి తప్పకుండా జరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సంతాన ప్రాప్తికి అవకాశముంది.
  3. కన్య: ఈ రాశిలో ఉన్న చంద్రుడితో గజకేసరి యోగం, సప్తమంలో ఉన్న కుజుడితో చంద్ర మంగళ యోగం కలగడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. సాధారణంగా ఆదాయపరంగా ఏ చిన్న ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను దాటుతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది.
  4. ధనుస్సు: రాశ్యధిపతి గురువుకు, చతుర్థంలో ఉన్న కుజుడికి కేంద్రంలో చంద్రుడి సంచారం వల్ల ఈ రాశి వారికి గజకేసరి, చంద్ర మంగళ యోగాలు కలుగుతున్నాయి. ఆర్థికంగా ఎన్నడూ లేనంత శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. ఆదాయపరంగా వీరికి తప్పకుండా దశ తిరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి, షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల లాభాలు కలగడానికి బాగా అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారమై భూలాభం కలుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
  5. కుంభం: ఈ రాశికి గజకేసరి, చంద్ర మంగళ యోగాలు ధన, పంచమ స్థానాల్లో ఏర్పడడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక లావాదేవీలు, ఆస్తులు, షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది. రావలసిన సొమ్మును, బాకీలను, బకాయిలను రాబట్టు కుంటారు. సొంత ఇల్లు అమరే అవకాశం ఉంది. తల్లితండ్రుల వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది.
  6. మీనం: ఈ రాశిలో చంద్ర మంగళ యోగం, చతుర్థ స్థానంలో ఈ గజకేసరి యోగం ఏర్పడుతున్నందువల్ల ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం కావడం, ఆస్తుల విలువ పెరగడం, గృహ, వాహన ప్రయత్నాలు సఫలం కావడం, కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి అవకాశాలు కలగడం వంటివి జరిగే అవకాశం ఉంది. తల్లి వైపు నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగంలో వేతనాలు, వృత్తి, వాపారాల్లో రాబడి పెరుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల లాభాలు కలుగుతాయి.

Follow Us