AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monalisa Bhosale: ప్రేమ - పెళ్లి - ఇప్పుడు గర్భవతి !! షాకు మీద షాకిస్తున్న మోనాలిసా

Monalisa Bhosale: ప్రేమ – పెళ్లి – ఇప్పుడు గర్భవతి !! షాకు మీద షాకిస్తున్న మోనాలిసా

Phani CH
|

Updated on: Apr 28, 2026 | 12:22 PM

Share

2025 ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా సంచలనం మోనాలిసా భోంస్లే, ఫర్మాన్ ఖాన్ వివాదం కొత్త మలుపు తిరిగింది. పోక్సో కేసు విచారణలో భాగంగా, మోనాలిసా గర్భవతి అని ఫర్మాన్ పోలీసులకు తెలిపాడు. మధ్యప్రదేశ్ పోలీసులు దీనిపై వైద్య ధృవీకరణ కోరుతున్నారు. మైనర్‌గా పెళ్లి, అదృశ్యం వంటి సంఘటనల తర్వాత, ఈ గర్భం ప్రకటన కేసును మరింత జటిలం చేసింది. మోనాలిసా ప్రస్తుతం కేరళ నుండి విచారణకు హాజరుకాలేనని ఫర్మాన్ పేర్కొన్నాడు.

2025 ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సంచలనంగా మారిన మోనాలిసా భోంస్లే.. ఇప్పుడు మళ్లీ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. రీసెంట్‌గా తన లవర్‌ ఫర్మాన్‌ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న మోనాలిసా.. అందుకు సంబంధించిన వీడియోలతో నెట్టింట వైరల్ అయింది. అయితే పెళ్లి టైంలో మోనాలిసా మైనర్ ఆమె పేరెంట్స్ మధ్యప్రదేశ్‌లో పోలీసులను ఆశ్రయించడంతో.. మోనాలిసా భర్త ఫర్మాన్ పై పోక్సో కేసు నమోదైంది. ఆ తరువాత అనూహ్యంగా మోనాలిసా మిస్ అయిందంటూ ఫర్మాన్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. కట్ చేస్తే ఇప్పుడు తన భార్య గర్భవతి అంటూ మోనాలిసా భర్త ఫర్మాన్ మరో బాంబు పేల్చడం.. సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి వైరల్ అవుతోంది. మోనాలిసా పేరెంట్స్ నమోదు చేసిన కేసు విచారణలో భాగంగా.. రీసెంట్‌గా మధ్యప్రదేశ్ పోలీసులు.. మోనాలిసా తో పాటు ఫర్మాన్‌కు నోటీసులు జారీ చేశారు. విచారణ కోసం..భర్త ఫర్మాన్‌తో పాటే మోనాలిసాను కూడా హాజరుకావాలని అందులో కోట్ చేశారు. అయితే ఇందుకు మోనాలిసా భర్త ఫర్మాన్ మోనాలిసా అంత దూరం ప్రయాణం చేయలేదంటూ బదులిచ్చాడు. మోనాలిసా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని.. ఆ కారణంగా కేరళ నుంచి మధ్య ప్రదేశ్‌ వరకు.. అంత దూరం ఆమె ప్రయాణం చేయలేదని ఫర్మాన్ పోలీసులు సమాచారం అందించాడు. అయితే ఇందుకు పోలీసులు కాస్తా స్ట్రిక్‌గా రియాక్టయ్యారు. మోనాలిసా నిజంగా గర్భవతి అవునా కాదా అనే విషయంపై పోలీసులు వైద్యపరమైన ధృవీకరణ కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సుశాంత్ సూసైడ్ కేసులో.. ప్రియురాలు రియాకు బిగ్ రిలీఫ్‌

JD Chakravarthy: విష్ణు ప్రియతో రెండో పెళ్లి.. ఎట్టకేలకు నోరు విప్పిన జేడీ చక్రవర్తి

Follow Us