మామిడి పండ్లు తింటే మొటిమలొస్తాయా..?

28 April 2026

TV9 Telugu

TV9 Telugu

మామిడి సీజన్ ప్రారంభమైంది. మామిడి పండ్లు వేడి చేస్తాయని, వాటిని తినడం వల్ల శరీరంలో వేడి పెరిగి.. ఫలితంగా మొటిమలొస్తాయని చాలామంది అనుకుంటారు

TV9 Telugu

కానీ ఇది నిజం కాదంటున్నారు నిపుణులు. ఇంకా చెప్పాలంటే వీటిలో పుష్కలంగా ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు.. వంటివన్నీ చర్మ ఆరోగ్యానికి మరింతగా దోహదం చేస్తాయంటున్నారు

TV9 Telugu

అయితే ఇప్పటికే మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలతో బాధపడే వారు వీటిని మరీ ఎక్కువగా తీసుకోకుండా మితంగా తినడం ఉత్తమం అని చెబుతున్నారు. వేసవిలో మామిడి పండు మరింత వేడి చేస్తుంది

TV9 Telugu

తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేయడం, దాన్ని శక్తిగా మార్చడంలో జీర్ణ వ్యవస్థ ఎంత బిజీగా ఉంటే శరీరంలో అంత వేడి జనిస్తుందంటున్నారు నిపుణులు. అంటే వేళాపాళా లేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి నమలడం, అమితంగా ఆహారం తీసుకోకూడదని దీన్ని బట్టి అర్థమవుతుంది 

TV9 Telugu

అంతేతప్ప మామిడి పండ్లు తినడానికి, శారీరక వేడికి సంబంధమే లేదంటున్నారు. అయితే వీటిని ఎక్కువగా తీసుకోకుండా ఉండడం ఉత్తమం అంటున్నారు

TV9 Telugu

ఇంకా ఈ విషయంలో సందేహంగా ఉంటే.. మామిడి పండ్లను కాసేపు చల్లటి నీటిలో నానబెట్టి.. ఆపై తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు

TV9 Telugu

మామిడి పండ్లను పూర్తిగా పండిన తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టమంటున్నారు నిపుణులు. అప్పుడే అవి మరింత రుచిగా ఉంటాయంటున్నారు

TV9 Telugu

అలాగే ఈ పండ్లకు ఎంత గాలి తగిలితే అవి అంత తాజాగా, రుచిగా ఉంటాయట! కాబట్టి వీటిని ప్లాస్టిక్‌ కవర్లు, బ్యాగుల్లో అస్సలు నిల్వ చేయకూడదు తద్వారా అవి త్వరగా పాడైపోతాయట