AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pokiri Movie: 20 ఏళ్ల ‘పోకిరి’.. ఈ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉండవచ్చు. కానీ పోకిరి మాత్రం చాలా ప్రత్యేకం.ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా ఎప్పుడూ క్లీన్‌ షేవ్‌తో క్లాస్‌గా కనిపించే మహేష్ తొలిసారి ఈ సినిమాలో ఊరమాస్‌ గెటప్‌లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు

Pokiri Movie: 20 ఏళ్ల 'పోకిరి'.. ఈ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా?
Mahesh Babu Pokiri Movie
Basha Shek
|

Updated on: Apr 28, 2026 | 12:58 PM

Share

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘పోకిరి’. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2006 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది. మొదటి రోజు నుంచే రికార్డుల వేట మొదలు పెట్టింది. అప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసేసింది. 200లకు పైగా కేంద్రాల్లో 100 రోజులు, 15 కేంద్రాల్లో 200 రోజుల పాటు ప్రదర్శించబడిన మొదటి తెలుగు చిత్రంగా పోకిరి నిలిచింది. కేవలం రూ.12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ. 40 కోట్లకు పైగా షేర్ సాధించింది. తద్వారా ఈ షేర్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా పోకిరి రికార్డులకు ఎక్కింది. ఈ సినిమాలో మహేష్ సరసన ఇలియానా హీరోయిన్ గా నటించింది. అలాగే ప్రకాశ్ రాజ్, నాజర్, ఆశిష్ విద్యార్థి, షయాజీ షిండే, బ్రహ్మానందం, అలీ, వేణు మాధవ్, సత్య ప్రకాశ్, సుబ్బరాజు, మాస్టర్ భరత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక పోకిరి సినిమాలో హైలెట్ అంటే మహేష్ పోషించిన పండుగాడు పాత్రనే అని చెప్పుకోవచ్చు. తన దైన శైలిలో మహేష్ బాబు చెప్పిన డైలాగులు, మేనరిజమ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

ఇదిలా ఉంటే పోకిరి సినిమా కథ రాసుకున్నప్పుడు తొలుత మహేశ్‌ని అనుకోలేదట పూరి జగన్నాథ్. మాస్‌ మహారాజ రవితేజని దృష్టిలో పెట్టుకొని ఈ స్టోరీని రెడీ చేశాడట. అయితే అప్పటికే రవితేజ చేతిలో పలు సినిమాలు ఉండడంతో పోకిరి సినిమాను చేయలేకపోయాడట రవితేజ. దీంతో సీన్ లోకి మహేశ్‌ ఎంట్రీ ఇచ్చేశారట. అలాగే ఈ సినిమాకు ‘ఉత్తమ్‌ సింగ్‌.. సన్నాఫ్‌ సూర్య’అని టైటిల్‌ను పూరి ఫిక్స్‌ చేసుకున్నాడట. అయితే రవితేజ తప్పుకోవడం వల్ల టైటిల్‌తో పాటు కథలో కొన్ని మార్పులు చేసి పోకిరి అనే టైటిల్‌ను ఫైనల్ చేశారట.

ఇవి కూడా చదవండి

ఇద్దరు హీరోయిన్లు నో..

పోకిరి సినిమాకు హీరోయిన్‌గా ఇలియానా కూడా ఫస్ట్‌ చాయిస్‌ కాదు. తొలుత ఈ చిత్రానికి హీరోయిన్‌గా సూపర్ హీరోయిన్ అయేషా టాకియాను సంప్రదించారట. కానీ ఎందుకో ఆమె ఒప్పుకోలేదట. అలాగే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ని తీసుకున్నాక షూటింగ్‌కి రెడీ అవుతున్న సమయంలో ఆమె కూడా హ్యాండించిందట. దీంతో చివరి నిమిషంలో ఇలియానాను సంప్రదిస్తే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసిందట. మొత్తానికి పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్న వీరు అన్ లక్కీ అని చెప్పవచ్చు.

బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసేసిన పోకిరి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'గబ్బర్ సింగ్' నటుడికి బ్రెయిన్ స్ట్రోక్.. ఆస్పత్రిలో చికిత్స
'గబ్బర్ సింగ్' నటుడికి బ్రెయిన్ స్ట్రోక్.. ఆస్పత్రిలో చికిత్స
తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం!
తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం!
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!