నిప్పులుకక్కే ఎండల్లో మధ్యాహ్నం చల్లని పుచ్చకాయ తింటే ఆ మజానే వేరు. అయితే పుచ్చకాయ తినేటప్పుడు అనుకోకుండా ఒక్కోసారి గింజలు మింగేయడం మనలో చాలా మందికి అనుభవమే
TV9 Telugu
నిజానికి మన జీర్ణవ్యవస్థ గింజలు మొలకెత్తే స్థలం కాదు. పైగా మనం వృద్ధాగా విసిరేస్తున్న ఈ గింజలు పోషకాహార నిధులు అని నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
అందుకే పుచ్చకాయ గింజలు పూర్తిగా సురక్షితమైనవి. వాటిని అలాగే మింగితే అవి ఫైబర్‌లా పని చేసి జీర్ణవ్యవస్థలో పెద్దగా మార్పులేకుండా బయటకు వెళ్లిపోతాయి
TV9 Telugu
కానీ వీటిని సరైన విధంగా తీసుకుంటే అసలు పోషక విలువలు అందుతాయి. చిన్నవిగా కనిపించినా పుచ్చకాయ గింజల్లో సుమారు 30 శాతం ప్రోటీన్ ఉండి, అర్జినిన్ అనే అమినో ఆమ్లం గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది
TV9 Telugu
వీటిలో ఉన్న మంచి కొవ్వులు (మోనో, పాలీ అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్) చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి ఖనిజాలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి
TV9 Telugu
ముఖ్యంగా రక్తహీనత సమస్య ఉన్నవారికి ఇవి సహజ పరిష్కారంగా ఉపయోగపడతాయి. పుచ్చకాయ గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. వేసవిలో శరీరానికి హైడ్రేషన్ అవసరం ఎక్కువగా ఉంటుంది
TV9 Telugu
ఈ గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని రక్షించి మెరుపును పెంచుతాయి. గుండె ఆరోగ్యానికి ఇవి మద్దతు ఇస్తాయి. వేడి కాలంలో గుండెపై పడే ఒత్తిడిని తగ్గించడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది
TV9 Telugu
వీటిలో ఉండే బి విటమిన్లు మెటబాలిజాన్ని మెరుగుపరచి ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయపడతాయి. పుచ్చగింజలను ఎండబెట్టి వేయించుకుని తింటే రుచిగా ఉంటాయి.. అలాగే పోషకాలూ అందుతాయి