AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జొన్న పిండి గారెల రుచేవేరండి ఒకటి రెండుతో ఆగరు.. లాగిస్తూనే ఉంటారు.. అంత బాగుంటాయి

Jowar flour garelu recipe Telugu: జొన్న పిండి గారెలు టేస్ట్ చాలా వేరు. ఒకటి తింటే అస్సలు వదలరు. ఆ రుచే చాలా వేరండి ఒకటి రెండుతో అస్సలు ఆగరు.. ప్లేట్స్ మీద ప్లేట్స్ లాగిస్తూనే ఉంటారు.. దీని రుచి అంత బాగుంటుంది మరి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.

Prasanna Yadla
|

Updated on: Apr 28, 2026 | 1:15 PM

Share

జొన్న పిండి గారెలకు కావలసిన పదార్థాలు:  ఒక కప్పు జొన్న పిండి,  ఒక ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి , ఒక చిన్న అల్లం ముక్క 
నాలుగు కరివేపాకు, అర కట్ట కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, ఉప్పు చాలా అవసరం.  ఇంకా పచ్చడికి సరిపడా నూనెను తీసుకోవాలి. ఇంకా ఈ పదార్థాలు అన్ని వేస్తే  గారెలకు మంచి రుచి వస్తుంది.

జొన్న పిండి గారెలకు కావలసిన పదార్థాలు: ఒక కప్పు జొన్న పిండి, ఒక ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి , ఒక చిన్న అల్లం ముక్క నాలుగు కరివేపాకు, అర కట్ట కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, ఉప్పు చాలా అవసరం. ఇంకా పచ్చడికి సరిపడా నూనెను తీసుకోవాలి. ఇంకా ఈ పదార్థాలు అన్ని వేస్తే గారెలకు మంచి రుచి వస్తుంది.

1 / 5
ఈ మిశ్రమాన్ని ఇలా తయారు చేసుకోవాలి: ఒక  గిన్నెలో జొన్న పిండిని దానిలో కట్ చేసిన ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, అల్లం కలపాలి. నాలుగు కరివేపాకు, అరకట్ట కొత్తిమీర, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలపాలి. వీటికి  నీరు పోస్తూ  గట్టిగా ఉండేలా చేసుకోవాలి.

2 / 5
ఈ మిశ్రమంలో ఒక కప్పు బియ్యం పిండి కలిపితే మరింత క్రిస్పీగా వస్తాయి. అలాగే, దీనిలో మిరియాల పొడి, కారం పొడి వేసినా స్పైసీగా రుచిగా ఉంటాయి. ఇంకా ఈ ముద్దను 10 నిమిషాల పాటు అలా ఉంచితే మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఇంట్లో చేసుకునేటప్పుడు ఇలాగే తయారు చేసుకోండి.

3 / 5

ఆ తరవాత చేతికి కొద్దిగా ఆయిల్ తీసుకుని రాసుకుని చిన్న ఉండలుగా తీసుకోవాలి. వాటిని, గారెల్లాగా చేసుకుని కాల్చడమే. ఇంకా దాని  మధ్యలో చిన్న రంధ్రం లాగా వేసుకుని నూనెలో బాగా వేయించుకోవాలి. ఇలా చేస్తే లోపల ఉడికి మంచి టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇవి మంచిగా తినడానికి రుచిగా ఉంటాయి.

4 / 5
ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి, మీడియం మంటపై గారెలు వేయాలి. ఒక్కసారిగా ఎక్కువ వేయకుండా కొద్దికొద్దిగా వేసుకుంటే సమంగా వేగుతాయి. గారెలను రెండు వైపులా బంగారు కలర్లోకి  మారే వరకు నెమ్మదిగా వేయించాలి. ఇలా చేస్తే  గారెలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి.

5 / 5
Follow Us