IPL 2026: ఎలిమినేట్ చేసేయండి సార్.! కింగ్‌లు అనుకుంటే బొంగు అయ్యారు.. లిస్టు చూస్తే షాకే
ఐపీఎల్ 2026 సీజన్‌లో కొందరు స్టార్ ఆటగాళ్ల పేలవ ప్రదర్శన వారి జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీస్తోంది. భారీ అంచనాలతో బరిలోకి దిగి విఫలమవుతున్న ఆ ఆటగాళ్లు ఎవరో ఇక్కడ తెలుసుకోండి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. బ్యాటర్లు బౌలర్లపై విరుచుకుపడుతూ భారీ స్కోర్లు నమోదు చేస్తున్నారు. అయితే, ఇదే సమయంలో కొందరు స్టార్ ఆటగాళ్లు మాత్రం తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చేతులెత్తేస్తున్నారు. టోర్నీ సెకండ్ హాఫ్‌లో కూడా వీరు ఫామ్‌లోకి రాకపోతే ఆయా జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలు గాలిలో దీపంలా మారే ప్రమాదం ఉంది.
ఇది చదవండి: కరివేపాకు మొక్క పెరగడం లేదా.? ఇవి ఇచ్చారంటే పచ్చగా, వద్దన్నా గుబురుగా పెరుగుతుంది..
ప్రధానంగా కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 25 కోట్లు పెట్టి కొన్న గ్రీన్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల్లో కేవలం 196 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్(189 పరుగులు), స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్(82 పరుగులు) వైఫల్యాలు ఆ జట్టును పాయింట్ల పట్టికలో వెనక్కి నెడుతున్నాయి. ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఇద్దరూ బ్యాటింగ్‌లో విఫలమవ్వడం వల్ల ముంబై కేవలం రెండు విజయాలకే పరిమితమైంది.
మరోవైపు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 7 మ్యాచ్‌ల్లో కేవలం 104 పరుగులే చేసి జిడ్డు బ్యాటింగ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్(88 పరుగులు), సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(186 పరుగులు) కూడా తమ మెరుపులను ఇంకా చూపించలేదు. ఆఖర్లో మెరుపులు మెరిపిస్తాడనుకున్న జితేష్ శర్మ కూడా తక్కువ స్ట్రైక్ రేట్‌తో విఫలమవుతున్నాడు. ఈ స్టార్ ఆటగాళ్లందరూ త్వరగా పుంజుకోకపోతే వారి జట్లకు ఈ సీజన్ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయే అవకాశం ఉంది.
ఇది చదవండి: అప్పు ఇస్తున్నారా.? ప్రామిసరీ నోటు మీద ఇది లేకపోతే.. చిత్తు కాగితంతో సమానం..
