AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరివేపాకు మొక్క పెరగడం లేదా.? ఇవి ఇచ్చారంటే పచ్చగా, వద్దన్నా గుబురుగా పెరుగుతుంది..

కరివేపాకు మొక్క గుబురుగా, ఏపుగా పెరగడం లేదా? నర్సరీ నుంచి తెచ్చినప్పటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాడాల్సిన ఎరువులు, తెగుళ్ల నివారణా పద్ధతులు వివరంగా ఇక్కడ తెలుసుకోండి. ఓ సారి ఈ స్టోరీ చూసేయండి మరి. ఆ వివరాలు.. ఇదిగో ఇలా..

కరివేపాకు మొక్క పెరగడం లేదా.? ఇవి ఇచ్చారంటే పచ్చగా, వద్దన్నా గుబురుగా పెరుగుతుంది..
Karivepaku Plant
Ravi Kiran
|

Updated on: Apr 27, 2026 | 1:02 PM

Share

మన వంటింట్లో కరివేపాకు లేనిదే ఏ తాలింపు పూర్తి కాదు. మార్కెట్‌లో కొనే కరివేపాకు కంటే మన ఇంట్లోనే పెంచుకున్న తాజా ఆకులకు ఉండే సువాసన వేరు. అయితే, చాలామంది తమ ఇంట్లో కరివేపాకు మొక్క పెరగడం లేదని, ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయని ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారికి కొన్ని అద్భుతమైన చిట్కాలు ఇవిగో.

ఇది చదవండి: ఇది చిటికెడు వేస్తే చాలు.. మందార మొక్కకు వచ్చే తెల్లని పురుగులను తరిమి కొట్టొచ్చు..

ముందుగా, నర్సరీ నుంచి తెచ్చిన మొక్కను వెంటనే పెద్ద కుండీలో పెట్టకూడదు. మొదట 8 లేదా 10 ఇంచుల చిన్న కుండీలో కనీసం ఆరు నెలల పాటు పెరగనివ్వాలి. మట్టి మిశ్రమంలో 40 శాతం మట్టి, 40 శాతం వర్మి కంపోస్ట్ లేదా పశువుల ఎరువు, మిగిలిన 20 శాతంలో ఇసుక, వేపపిండి, కోకోపీట్ కలిపి వాడుకోవాలి. కరివేపాకు మొక్కకు సూర్యరశ్మి చాలా ముఖ్యం. రోజుకు 6 నుంచి 8 గంటల ఎండ తగిలితేనే మొక్క ఏపుగా పెరుగుతుంది. బాల్కనీల్లో తక్కువ ఎండ తగిలే చోట ఈ మొక్క సరిగ్గా పెరగదు.

మొక్క గుబురుగా రావాలంటే పైన చిన్న చిన్న కొమ్మలను తుంచుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పక్క నుంచి కొత్త కొమ్మలు వచ్చి మొక్క గుబురుగా తయారవుతుంది. అలాగే తెగుళ్ల నివారణకు వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం మంచిది. కరివేపాకు మొక్కకు ఇచ్చే ఎరువుల్లో ‘పుల్లటి మజ్జిగ’ అమృతం లాంటిది. మూడు రోజులు పులియబెట్టిన మజ్జిగలో కొంచెం ఇంగువ కలిపి 15 రోజులకు ఒకసారి మొక్కకు ఇస్తే, మట్టిలో మైక్రోబ్స్ పెరిగి మొక్క చాలా గ్రీన్‌గా తయారవుతుంది. సమ్మర్‌లో మొక్కపై మల్చింగ్ చేయడం ద్వారా తేమను కాపాడవచ్చు. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ ఇంట్లో కూడా కరివేపాకు మొక్క వద్దన్నా పెరుగుతుంది.

ఇది చదవండి: వాటర్ ట్యాంక్ క్లీనింగ్ ఇక చిటికలో పని.. లోపలికి దిగకుండానే ఈజీగా శుభ్రం చేయండిలా.!

Follow Us
సొరకాయతో ఇలా కారం పచ్చడి చేశారంటే అన్నం గిన్నె ఖాళీ కావాల్సిందే!
సొరకాయతో ఇలా కారం పచ్చడి చేశారంటే అన్నం గిన్నె ఖాళీ కావాల్సిందే!
రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా? ఈ పిండితో రుద్దితే చాలు
రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా? ఈ పిండితో రుద్దితే చాలు
అమెరికన్లే టార్గెట్.. రూ.261 కోట్లు కొల్లగొట్టిన ముఠా!
అమెరికన్లే టార్గెట్.. రూ.261 కోట్లు కొల్లగొట్టిన ముఠా!
నిరంతరం బాలిక క్షేమసమాచారాలు ప్రజలకు చేరవేస్తున్న నారా లోకేశ్
నిరంతరం బాలిక క్షేమసమాచారాలు ప్రజలకు చేరవేస్తున్న నారా లోకేశ్
దీపావళి పొల్యూషన్.. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి యమ డేంజర్!
దీపావళి పొల్యూషన్.. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి యమ డేంజర్!
చోరీ నిందతో మనస్తాపం.. రైలు కింద పడి 17 ఏళ్ల బాలుడి ఆత్మహత్య
చోరీ నిందతో మనస్తాపం.. రైలు కింద పడి 17 ఏళ్ల బాలుడి ఆత్మహత్య
భూమి వైపు దూసుకొస్తున్న నాసా టెలిస్కోప్‌ .. భారత్‌లో శకలాలు!
భూమి వైపు దూసుకొస్తున్న నాసా టెలిస్కోప్‌ .. భారత్‌లో శకలాలు!
ఓటమి తర్వాత రివర్స్ కలెక్షన్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
ఓటమి తర్వాత రివర్స్ కలెక్షన్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
మూడు నెలల తర్వాత సడన్‌గా ఓటీటీలోకి రొమాంటిక్ మూవీ
మూడు నెలల తర్వాత సడన్‌గా ఓటీటీలోకి రొమాంటిక్ మూవీ
టికెట్‌ ఇవ్వని పార్టీలకు రెబల్స్ ఝలక్..
టికెట్‌ ఇవ్వని పార్టీలకు రెబల్స్ ఝలక్..