సమ్మర్‌లోనూ బాడీని కూల్‌గా ఉంచుకోవాలా?.. అయితే ఈ ఫుడ్స్ కచ్చితంగా తినాల్సిందే
Anand T
27 April 2026
అధిక నీటి శాతం ఉన్న ఈ పండు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడమే కాకుండా, ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఉపశమనాన్ని ఇస్తాయి.
పుచ్చకాయ
బాడీని కూల్‌గా ఉంచడంలో పుదీనా ఆకులు చాలా ప్రభావవతంగా పనిచేస్తాయి. వీటిని చట్నీలు లేదా పానీయాలలో వాడవచ్చు. పుదీనాలోని సహజమైన చలవ గుణం ఎండ వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
పుదీనా ఆకులు
పెరుగును మజ్జిగ లేదా లస్సీ రూపంలో తీసుకోవడం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు. అలాగే ఇది ఇది జీర్ణక్రియకు కూడా చాలా మంచిది. వేసవిలో బాడీని కూల్‌గా ఉంచుకోవడంలో ఇది చాలా ప్రభావితంగా పనిచేస్తుంది.
పెరుగు
ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణమే చలవను అందిస్తాయి. దీని వల్ల శరీరం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
కొబ్బరి నీరు
ఇది తక్షణ శక్తిని అందించడమే కాకుండా. శరీరంలో నీటి శాతాన్ని క్రమబద్ధీకరిస్తూ, లోపలి నుండి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
అరటిపండు
ఇందులోని మోనో-శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి రక్తంలోని అదనపు వేడిని, విషతుల్యాలను తొలగించడంలో సహాయపడతాయి.
అవకాడో
అధిక ఫైబర్, నీటి శాతం ఉన్న దోసకాయ, మలబద్ధకాన్ని నివారించడమే కాకుండా శరీర వేడిని తగ్గిస్తుంది. తద్వారా సమ్మర్‌లో బాడీని కూల్‌గా ఉంచుతుంది.
దోసకాయ
సొరకాయ, బెండకాయ వంటి కూరగాయలు తేలికగా జీర్ణమవుతాయి, శరీరానికి కావాల్సిన నీటిని అందిస్తాయి. దీని వల్ల బాడీ కూల్‌గా ఉంటుంది.