AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Serial Actor: ఐదు సార్లు బ్రేకప్ అయ్యింది..! అబ్బో.. ఈ సీరియల్ నటుడి లిస్ట్ పెద్దదే

సెలబ్రెటీల లైఫ్ లో ఏది జరిగిన డి వార్తల్లోనో లేక సోషల్ మీడియాలోనో వైరల్ అవ్వడం కామన్. ముఖ్యంగా సెలబ్రెటీల లవ్ ఎఫైర్స్, పెళ్లి, విడాకులు వంటివి తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఓ సీరియల్ హీరో లవ్ స్టోరీలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Serial Actor: ఐదు సార్లు బ్రేకప్ అయ్యింది..! అబ్బో.. ఈ సీరియల్ నటుడి లిస్ట్ పెద్దదే
Tollywoodnews
Rajeev Rayala
|

Updated on: Apr 28, 2026 | 1:12 PM

Share

అర్జున్ కళ్యాణ్ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ నటుడు. సీరియల్స్ తో పాటు బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొన్నాడు. బిగ్ బాస్ ద్వారా మనోడి క్రేజ్ మరింత పెరిగిపోయింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సీరియల్స్ తో పాటు పలు టీవీ షోల్లోనూ బిజీగా మారిపోయాడు అర్జున్. కాగా తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా తన ప్రేమ సంబంధాలు, బ్రేకప్ లపై ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అర్జున్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తన బ్రేకప్ ల గురించి, ఇతర నటీమణులతో ఉన్న అనుబంధాల గురించి వివరించాడు. తన ఇంజనీరింగ్ రోజుల్లో రెండు బ్రేకప్ లు, అమెరికాలో మరొక బ్రేకప్ జరిగాయని వెల్లడించారు. తన బ్రేకప్ లకు అలవాటు పడిపోవడం వల్లే తనను “బ్రేకప్ కింగ్” అని కూడా పిలవవచ్చని సరదాగా అన్నారు.

ఇది కూడా చదవండి :  Sudha: నా కళ్ళ ముందు పెరిగిన పిల్లాడు.. ఇప్పుడు ఇంత పెద్ద హీరో అయ్యాడు..

నటి పూజిత పొన్నాడతో గత సంబంధం గురించి మాట్లాడుతూ, వారు కలిసి దాదాపు ఐదు షార్ట్ ఫిల్మ్‌లలో నటించారని తెలిపారు. వాటిలో “ఉప్మా తినేది” అనే పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ చాలా పాపులర్ అయిందని గుర్తు చేసుకున్నారు. ఒకానొక సమయంలో వారిద్దరూ ప్రేమించుకున్నారని, పెళ్లి రూమర్‌లు కూడా వచ్చాయని అర్జున్ తెలిపాడు. అయితే, కారణాలు ఏవైనా ఆ సంబంధం కొనసాగలేదని, అది పరస్పర అంగీకారంతో కూడిన బ్రేకప్ అని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం మేము ఒకరికొకరు అరుదుగా టచ్‌లో ఉన్నామని, ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉందని పేర్కొన్నాడు. నటి శ్రీ సత్యతో తన అనుబంధం గురించి మాట్లాడుతూ, ఆమె తన మంచి స్నేహితురాలని అర్జున్ కళ్యాణ్ వివరించారు. బిగ్ బాస్ తర్వాత వారిద్దరి మధ్య లింకప్ రూమర్‌లు రావడంతో, స్నేహం దెబ్బతినకుండా ఉండేందుకు తాము కొంత దూరం మెయింటైన్ చేశామని తెలిపారు. అయితే, అప్పుడప్పుడు కలిసి చేసిన రీల్స్‌ వైరల్ అయ్యేవని పేర్కొన్నాడు.

ఇది కూడా చదవండి : అప్పుడు ఈవెంట్‌లో పన్నీరు చల్లింది.. ఇప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. ఈ అమ్మడికి క్రేజ్ మాములుగా లేదు

భవిష్యత్తులో తనకూ, శ్రీ సత్యకూ మధ్య ఎలాంటి అదనపు సంబంధం ఏర్పడే అవకాశం లేదని ఆయన ఖచ్చితంగా చెప్పాడు. వాసంతి కృష్ణన్‌తో తన బంధం గురించి మాట్లాడుతూ, ఆమె తన స్నేహితురాలు మాత్రమేనని, వారి మధ్య ప్రేమ సంబంధం ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు. బీబీ జోడి వంటి షోలలో వాసంతితో క్లోజ్ గా ఉండడం స్క్రిప్టెడ్ కాదని, అయితే నిర్వాహకులు ఇచ్చే “ఛాయిస్” మేరకు అవి జరుగుతాయని ఆయన వివరించారు. అంటే, టాస్క్‌లలో భాగంగా ఇలాంటివి అడిగినప్పుడు, పాల్గొనేవారి అంగీకారం బట్టి అవి జరుగుతాయని ఆయన పేర్కొన్నాడు. తన కుటుంబం తన ప్రేమ బంధాలపై ఎలా స్పందిస్తుందో కూడా అర్జున్ కళ్యాణ్ వివరించారు. తన కుటుంబం చాలా ఆధునికంగా ఉంటుందని, తన ప్రేమ వ్యవహారాలు వారికి ముందుగానే తెలుస్తాయని తెలిపాడు. తాను ఎవరితోనైనా సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లయితే, ఆ విషయాన్ని వారికే స్వయంగా చెబుతానని పేర్కొన్నాడు. పూజిత పొన్నాడ విషయంలో కూడా తన కుటుంబం సానుకూలంగానే స్పందించిందని, రూమర్‌ల కన్నా ముందుగానే వారికి నిజం తెలుస్తుందని అర్జున్ చెప్పుకొచ్చాడు .. తన బ్రేకప్ ల గురించి కుటుంబానికి తెలుసు కాబట్టి, అలాంటి వార్తలు వారికి షాకింగ్ న్యూస్ లా ఉండవని ఆయన స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : తెలుగులో అతనంటే పిచ్చి.. నా ఫేవరెట్ హీరో ఆయనే.. మనసులో మాట చెప్పిన కృతిశెట్టి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us