AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న వయసులోనే పెళ్లి.. ఇంటినుంచి పారిపోయి ఇండస్ట్రీకి.. కట్ చేస్తే 17ఏళ్లలో 450 సినిమాలు

భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన నటీమణులలో ఈ అందాల తార ఒకరు ఒకరు. ఆమె జీవితం, సినీ ప్రస్థానం, అకస్మాత్తుగా ముగిసిన తీరు ఇప్పటికీ అనేక ప్రశ్నలకు తావిస్తోంది.పేద కుటుంబం కావడంతో, స్మిత నాలుగవ తరగతిలోనే చదువు ఆపేసి కుటుంబ భారాన్ని మోయడం ప్రారంభించింది.

Rajeev Rayala
|

Updated on: Apr 28, 2026 | 11:34 AM

Share
భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన నటీమణులలో ఈ అందాల తార ఒకరు ఒకరు. ఆమె జీవితం, సినీ ప్రస్థానం, అకస్మాత్తుగా ముగిసిన తీరు ఇప్పటికీ అనేక ప్రశ్నలకు తావిస్తోంది.పేద కుటుంబం కావడంతో, స్మిత నాలుగవ తరగతిలోనే చదువు ఆపేసి కుటుంబ భారాన్ని మోయడం ప్రారంభించింది. చిన్న వయసులోనే వివాహం జరిగినప్పటికీ, అత్తవారి వేధింపులు తట్టుకోలేక ఇంటి నుండి పారిపోయింది. సినిమా రంగంలోకి రావాలనే ఆశతో, ఆమె మొదట టచ్-అప్ ఆర్టిస్ట్‌గా సినీ ప్రపంచంలో అడుగుపెట్టింది. ఆతర్వాత నటిగా మారింది. తక్కువ సమయంలోనే స్టార్ గా మారిపోయింది. ఇండస్ట్రీని ఏలింది ఆమె. 

1 / 7
ఆమె ఎవరో కాదు సిల్క్ స్మిత. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు దగ్గర కొవ్వలిలో జన్మించిన విజయలక్ష్మి అసలు పేరు సిల్క్ స్మిత. చిన్న వయసులోనే ఇంటినుంచి పారిపోయి వచ్చి సినిమాల్లోకి అడుగుపెట్టింది. మలయాళ చిత్రం "ఇనయ్ తేడి"తో హీరోయిన్‌గా మొదటి అవకాశం లభించింది. ఈ చిత్ర దర్శకుడు ఆంథోనీ, విజయలక్ష్మి పేరును స్మితగా మార్చాడు. ఆ తర్వాత తమిళ చిత్రం "వండి చక్రం"లో ఆమె పోషించిన సిల్క్ అనే పాత్ర బాగా ప్రాచుర్యం పొందడంతో, ఆమె "సిల్క్ స్మిత"గా మారింది. 17 ఏళ్ల తన సినీ జీవితంలో స్మిత సుమారు 450 చిత్రాలలో నటించింది. సినీ పరిశ్రమలోకి రావడానికి స్మిత ఎన్నో ఒడిదుడుకులను, అవమానాలను ఎదుర్కొంది. సినిమాలకు పనికిరాదని ఎందరో ఆమెను నిరుత్సాహపరిచారు.

2 / 7
కానీ వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని ఒక నటిగా, నిర్మాతగా తనను తాను నిరూపించుకుంది. మొదట్లో ఆమెకు నటన కానీ, అనర్గళంగా డైలాగులు చెప్పడం కానీ వచ్చేది కాదు. సరైన చదువు లేకపోవడంతో, డైలాగ్ ఎవరైనా చదివి వినిపిస్తే కానీ అర్థం చేసుకోలేకపోయేది. పైగా, ఆమెది చామనఛాయ వర్ణం. ఇవన్నీ ఆమెకు మైనస్‌లుగా ఉన్నప్పటికీ, డాన్స్ లో ఆమెకున్న అద్భుతమైన ప్రతిభ, తనను తాను ఎలా ప్రదర్శించుకోవాలో తెలిసిన నైపుణ్యం, ముఖ్యంగా ఆమె మత్తెక్కించే కళ్ళు స్మితను తిరుగులేని నాట్యతారని చేశాయి. మద్రాసు చేరుకున్న స్మిత అప్పటి క్యారెక్టర్ నటి ఛాయాదేవి ఇంట్లో అద్దెకు దిగింది. అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఛాయాదేవికి టచ్-అప్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ జీవనం సాగించింది. ఈ సమయంలో నటీనటుల దగ్గర మెలకువలు నేర్చుకుంటూ ఉండేది.

3 / 7
ఛాయాదేవి ద్వారా త్రిపురనేని వరప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన "ఆడదంటే అలుసా" చిత్రంలో ఫటాఫట్ జయలక్ష్మి పక్కన స్నేహితురాలిగా నటించింది. ఆ తర్వాత "తాయారమ్మ బంగారయ్య", "సీతాకోకచిలుక" వంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించినా, ప్రేక్షకులు ఆమెను గ్లామర్ తారగానే ఆదరించారు. 1980 నుండి 1990 వరకు పదేళ్ల పాటు ఆమె ప్రతి సినిమాలో నటించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో ఆమె నృత్య ప్రదర్శనలు తప్పనిసరి అయ్యాయి. ప్రొడక్షన్ స్థాయిలో ఆగిపోయిన సినిమాలు కూడా స్మిత డ్యాన్స్ యాడ్ చేస్తే సూపర్ హిట్ అయిన సందర్భాలు అనేకం. తమిళ పరిశ్రమలో ఆమెకున్న క్రేజ్ హీరోలకు కూడా ఉండేది కాదు.

4 / 7
ఆమె తిన్న ఆపిల్ సైతం 25,000 రూపాయలకు కొన్నారంటే ఆమె క్రేజ్ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. సిల్క్ స్మితకు గొప్ప డ్రెస్ సెన్స్ కూడా ఉంది. పెద్దగా చదువుకోనప్పటికీ, గొప్ప చదువులు చదువుకున్నవారే ఆశ్చర్యపోయేలా ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం సంపాదించింది. ఎదుగుతున్న సమయంలో అహంకారి అని, డైరెక్టర్లను, ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెడుతుందని అనేక పుకార్లు వచ్చాయి. అయితే ఆమెతో పనిచేసిన వారే అవి నిజం కాదని స్పష్టం చేశారు. మత్తెక్కించే కళ్లతో ప్రేక్షకులను కట్టిపడేసిన స్మిత నిజ జీవితంలో ఎంతో గొప్ప వ్యక్తిత్వం గల మనిషి. చేసిన మేలును జీవితాంతం గుర్తుంచుకునే సంస్కారం ఆమెది.

5 / 7
తనకు చిన్న పాత్రలో అవకాశం ఇచ్చిన సుగన్ బాబు చిత్రం "భూదేవి" రిలీజ్ అయ్యే నాటికి స్మిత గొప్ప స్థాయిలో ఉంది. ఆ సమయంలోనే తన పాత్రలో కొన్ని మార్పులు ఉన్నాయని సుగన్ బాబు ఫోన్ చేస్తే, అర్ధరాత్రి వెళ్లి మరీ షూటింగ్ పూర్తి చేసింది. డబ్బు, పేరు, అందం అన్నీ ఉన్నప్పటికీ, అందరు అమ్మాయిల్లాగే ప్రేమగా చూసుకునే తోడు కావాలని స్మిత కోరుకుంది. కష్టం వచ్చినప్పుడు, ఒంటరితనం వెంటాడినప్పుడు సహాయం చేసిన వారిని గుడ్డిగా నమ్ముతారు. సరిగ్గా అలాంటి తప్పే స్మిత కూడా చేసింది. వైజాగ్ కు చెందిన ఒక డాక్టర్ ఆమె జీవితంలోకి సెక్రటరీగా, మేనేజర్‌గా ప్రవేశించాడు. ఎక్కడలేని అభిమానం చూపించాడు. ఒంటరితనాన్ని దూరం చేసిన అతన్ని స్మిత ఎంతగానో నమ్మింది.

6 / 7
అయితే అతను అప్పటికే వివాహితుడు, పిల్లలు కూడా ఉన్నారు. అతని గురించి తెలిసినా స్మిత అతనికి దగ్గరైంది. చివరికి అతను తన కుటుంబాన్ని కూడా తీసుకువచ్చి స్మిత ఇంట్లోనే కాపురం పెట్టినా ఆమె ఏమీ అనలేని స్థితికి చేరుకుంది. తన డేట్స్, లావాదేవీల విషయంలో స్మిత అతన్ని పూర్తిగా నమ్మేసింది. తన చుట్టూ ఒక కంచుకోటలా కట్టేస్తున్నా కూడా తెలుసుకోలేని పరిస్థితికి స్మిత చేరుకుంది. చివరికి స్మిత కదలికలను కూడా నియంత్రించే స్థాయికి అతను చేరుకున్నాడు. 1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని తన సొంత ఇంట్లో ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఆమె జీవన ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆమె మరణం వెనుక ఉన్న కారణాలు ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలుగా మిగిలిపోయాయి.

7 / 7
Follow Us