AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: 10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో ఎమ్మెల్యే.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి?

పడ్నాడు జిల్లాలో ఎస్పీ కార్యాలయంలో మంగళవారం హైడ్రామా చోటుచేసుకుంది. ఎస్పీ కార్యాలయ లీగల్ అడ్వైజర్ నియామకం విషయంలో నర్సరావుపేట ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీల మద్య వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న గుంటూరు రేంజ్ ఐజీ కలగజేసుకొని సమస్యను పరిష్కరించడంతో ఈ వివాదం సద్దుమణిగింది.

Andhra News: 10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో ఎమ్మెల్యే.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి?
Palnadu Sp Office Controversy
T Nagaraju
| Edited By: |

Updated on: Apr 01, 2026 | 6:45 PM

Share

మంగళవారం మధ్యాహ్నం సడెన్‌గా జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్‌బాబు నేరుగా ఎస్పీ క్రిష్ణారావు ఛాంబర్‌కు వెళ్లారు. ఎస్పీ లీగల్ అడ్వైజర్ నియామకం విషయంలో తాను సూచించిన పేరుపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదో చెప్పాలంటూ ఎస్పీని ప్రశ్నించారు.దీంతో ఎస్పీ మీరు పంపిన వినతి పత్రం అంశంపై పరిశీలన చేస్తున్నామని త్వరలోనే నియామకం జరుగుతందని ఎస్పీ చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే గత ఎనిమిది ఈ అంశంపై తాను ఎస్పీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నానని.. ఎంపితో పాటు ఇంఛార్జ్ మంత్రి సిఫార్స్ చేసిన తర్వాత కూడా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలోనే ఎస్పీ క్రిష్ణారావు తన కార్యాలయం నుండి క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే లీగల్ అడ్వైజర్ ఫైల్ పై సంతకం చేసే వరకూ తాను కార్యాలయంలోనే కూర్చొంటానంటూ అక్కడే ఉండిపోయారు.

ఇంతలో మళ్లీ ఆఫీస్ వచ్చిన ఎస్పీ ఎమ్మెల్యే మాట్లాడిన ఆయన సూచించిన వ్యక్తినే లీగల్ అడ్వైజర్‌గా నియమిస్తూ ఫైల్ పై సంతకం చేశారు. అయితే ఇందుకు సంబంధించిన ఆర్డర్ కూడా వెంటనే ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. ఆర్డర్స్ వచ్చేంత వరకూ బయటకు వెళ్లేది లేదంటూ అక్కడే కూర్చుకొన్నారు. విషయం తెలుసుకున్న టిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ విషయాన్ని పరిష్కరించాలని జిల్లా అధ్యక్షుడు జానీ, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సూచించారు. దీంతో ఎస్పీ కార్యాలయానికి చేరకున్న ఇద్దరు నేతలు ఎమ్మెల్యేతో పలు దఫాలుగా సంప్రదింపులు జరిపారు. అయితే ఆర్డర్స్ ఇవ్వాల్సిందేనంటూ ఎమ్మెల్యే గట్టిగా చెప్పడంతో మరో దఫా అందరూ కలిసి చర్చించారు.

అయితే అక్కడికి చేరుకన్న గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠీ చర్చించి లీగల్ అడ్వైజర్ అంశంపై ఆర్డర్స్ ఇస్తామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే అరవింద్ బాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఎమ్మెల్యే అరవింద్ ఈ విధంగా చేయడం ఇదే మొదటి సారి ఏం కాదు.. గతంలోనూ ఎక్సైజ్ కమీషనర్ కార్యాలయంలో తాను చెప్పిన వాళ్లకి కాంట్రాక్ట్ బేసిక్ పోస్టులు ఇవ్వాలని పట్టుబడుతూ బైఠాయించారు. మరొసారి ఎస్పీ కార్యాలయంలో ఇలానే చేయడంతో ఆయన తీరుపై విమర్శలు వస్తున్నాయి. అయితే అధికారులు ప్రజా ప్రతినిధులు సిఫార్సులు పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతోనే తాము పట్టుబట్టాల్సి వచ్చిందని ఎమ్మెల్యే అనుచరుల చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us