Bharateeyudu 2: విడుదలకు ముందే కమల్ ‘భారతీయుడు 2’కు కష్టాలు.. రిలీజ్ ఆపాలంటూ..

భారతీయుడు-2 రిలీజ్ ఎప్పుడు? మేకర్స్ అనౌన్స్ చేసినట్టు జులై 12న విడుదలవుతుందా? వాయిదా పడుతుందా? బాలారిష్టాలను దాటుకుని రిలీజ్‌కి సిద్ధమైన ఈ పాన్ ఇండియా మూవీ.. లేటెస్ట్‌గా కోర్టు ఆదేశాలతో చిక్కుల్లో పడింది. ఇంతకీ కోర్టుకెక్కిందెవరు? అభ్యంతరాలేంటి?

Bharateeyudu 2: విడుదలకు ముందే కమల్ 'భారతీయుడు 2'కు కష్టాలు.. రిలీజ్ ఆపాలంటూ..
Bharateeyudu 2
Follow us

|

Updated on: Jul 10, 2024 | 9:00 AM

భారతీయుడు సినిమా విడుదలైన 25 ఏళ్లకి.. సీక్వెల్‌గా భారతీయుడు-2 సినిమా వస్తోంది. ఈనెల 12న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. కానీ అంతకన్న ముందు కోర్టు నోటీసులు మూవీ యూనిట్‌ను కంగారుపెడుతున్నాయి. కారణం.. సినిమాను నిలిపివేయాలని రాజేంద్రన్‌ కోర్టుకెళ్లడమే. మర్మకళకు సంబంధించిన సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారాయన. దీంతో అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్నది కమల్ ఫ్యాన్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా 1996లో వచ్చిన భారతీయుడు సినిమా సంచలన నిజయాన్ని అందుకుంది. ఇందులో కమల్ హాసన్ డ్యుయెల్ రోల్ చేసి మెప్పించారు. తండ్రి సేనాపతి పాత్రలో కమల్‌ నటన, హావభావాలు ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. భారతీయుడు-2లోనూ కమల్ అంతకుమించి అనేలా రోల్ చేస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కింది. సీక్వెల్‌ ను ప్రకటించగానే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే మొదటి నుంచి ఈ సినిమా వివాదాలు చుట్టుముట్టాయి.

ఇది చదవండి: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం

ముందుగా లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చింది. మొదట్లో బాగానే ఉన్నా..  బడ్జెట్ విషయంలో నిర్మాతలు – డైరెక్టర్‌ శంకర్ మధ్య గొడవలు జరిగాయి. దీంతో శంకర్ మీద కేసు పెట్టారు. చాలాకాలంపాటు కోర్టులో నలిగింది. కేసు నుంచి శంకర్ బయటపడ్డాక.. కమల్ విక్రమ్‌ షూటింగ్ కారణంగా భారతీయుడు 2 ఆలస్యమైంది. 2020లో సెట్లో ప్రమాదం జరగడం, నలుగురు చనిపోవడం, కరోనా లాక్ డౌన్,  దర్శకనిర్మాతల మధ్య వివాదాలతో సినిమా షూటింగ్ చాలా రోజులు నిలిచిపోయింది. ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన ఈ మూవీ వేర్వేరు కారణాలతో చిత్రీకరణ ఆగిపోవడం ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసింది.

ఎన్నోసార్లు వాయిదాపడిన తర్వాత ఫైనల్‌గా జులై 12న విడుదలకు సిద్ధమయ్యింది భారతీయుడు-2. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఈ మధ్యే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు మేకర్స్. అయితే ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా కోర్టును ఆశ్రయించారు రాజేంద్రన్‌. పార్ట్‌ 1లో మర్మకళకు సంబంధించిన సీన్లలో కీలకంగా వ్యవహరించిన ఆయన.. పార్ట్‌-2కి వచ్చేసరికి మాత్రం రివర్స్ అయిపోయాడు. ఎందుకంటే.. ఆయనకు సంబంధం లేకుండా మర్మకళకు సంబంధించి అంశాలను వాడుకున్నారట. ఈ విషయంలో అసంతృప్తితో ఉన్న రాజేంద్రన్‌ కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది.

ఇది చదవండి: ద్యావుడా.! వాటే మేకోవర్.. ఈ వయ్యారి అందాన్ని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

భారతీయుడు-1 లో స్వాతంత్ర్య నేపథ్యాన్ని చూపించారు. బ్రిటిష్ వాళ్లకి వ్యతిరేకంగా చేసిన పోరాటాలకి సంబంధించి.. రాజేంద్రన్ రచించిన మర్మకళ పుస్తకం ఆధారంగా సీన్లను చిత్రీకరించారు. అలాగే భారతీయుడు-2లో కూడా మర్మకళకు సంబందించిన సీన్లను తీశారు. అయితే పార్ట్‌ -1 కి పార్ట్‌ -2కి బ్యాగ్రౌండ్‌ టోటల్ డిఫరెంట్‌. ఈ కారణంగా మర్మకళను ఈ తరానికి చూపిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నది రాజేంద్రన్ అభ్యంతరం. సినిమా షూటింగ్ సమయంలో ఇదే విషయాన్ని మూవీ యూనిట్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారాయన. అందుకే ఇప్పుడు సినిమాను నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించానంటున్నాడు. రాజేంద్రన్ పిటిషన్ స్వీకరించిన మధురై కోర్ట్‌ కమల్ హాసన్‌, శంకర్‌, లైకా నిర్మాతలకి నోటీసులు పంపింది. ఈనెల 11లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఈనెల 12న విడుదల కావాల్సి ఉంది భారతీయుడు-2. కానీ అంతకంటే ఒక రోజు ముందు వివరణ ఇవ్వాలని మధురై కోర్టు ఆదేశించింది. కోర్టుకి ఎలాంటి వివరాలు అందజేస్తారు..? వాటితో కోర్టు సంతృప్తిచెందుతుందా? సినిమా రిలీజ్‌పై ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది. సినిమా ఆరంభం నుంచి వివాదాలను దాటుకుని వస్తున్న భారతీయుడు-2.. రిలీజ్‌ విషయంలోనూ చిక్కుల్లో పడక తప్పలేదు.

ఇది చదవండి: ఇప్పుడిదే ట్రెండింగ్ బిజినెస్.. లక్షల్లో డబ్బు.. స్టార్ట్ చేస్తే తిరుగుండదిక

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ హీరోయిన్‌తో సాయిధరమ్ తేజ్ ప్రేమ వివాహం! క్లారిటీ ఇచ్చిన టీమ్
ఆ హీరోయిన్‌తో సాయిధరమ్ తేజ్ ప్రేమ వివాహం! క్లారిటీ ఇచ్చిన టీమ్
చండీపుర వైరస్, డెంగ్యూ లక్షణాల మధ్య తేడా ఏమిటి? ఎలా గుర్తించాలంటే
చండీపుర వైరస్, డెంగ్యూ లక్షణాల మధ్య తేడా ఏమిటి? ఎలా గుర్తించాలంటే
జూనియర్ సింహం వస్తుంది..!
జూనియర్ సింహం వస్తుంది..!
ఈ ఆటోలో అలా చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన ప్రేమ జంట.. ఎక్కడంటే..
ఈ ఆటోలో అలా చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన ప్రేమ జంట.. ఎక్కడంటే..
వర్షాకాలంలో రాజస్థాన్ లో ఈ ప్రదేశాలు.. చూస్తే ఔరా అనాల్సిందే..
వర్షాకాలంలో రాజస్థాన్ లో ఈ ప్రదేశాలు.. చూస్తే ఔరా అనాల్సిందే..
వాహనం నడిపే వారికి మరిన్ని కష్టాలు..అదేంటో తెలిస్తే మైండ్ బ్లాంకే
వాహనం నడిపే వారికి మరిన్ని కష్టాలు..అదేంటో తెలిస్తే మైండ్ బ్లాంకే
ఇకపై పిజ్జాలు తినేయవచ్చు.. 'మిల్లెట్ పిజ్జా' స్పెషల్‌గా మీ కోసం!
ఇకపై పిజ్జాలు తినేయవచ్చు.. 'మిల్లెట్ పిజ్జా' స్పెషల్‌గా మీ కోసం!
బడ్జెట్‌ తర్వాత తగ్గిన బంగారం, వెండి ధరలు
బడ్జెట్‌ తర్వాత తగ్గిన బంగారం, వెండి ధరలు
తల్లికి వందనం పథకంపై మంత్రి లోకేష్ క్లారిటీ.. ఎంతమందికి ఇస్తారంటే
తల్లికి వందనం పథకంపై మంత్రి లోకేష్ క్లారిటీ.. ఎంతమందికి ఇస్తారంటే
ఆ పాస్ పోర్టు ఉంటే.. 195 దేశాల్లో మీకు తిరుగులేదు..
ఆ పాస్ పోర్టు ఉంటే.. 195 దేశాల్లో మీకు తిరుగులేదు..