Vijay Antony : సస్పెన్స్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నవిలక్షణ నటుడు విజయ్ ఆంటోనీ

డాక్టర్ సలీమ్, బిచ్చగాడు, బేతాళుడు వంటి విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Vijay Antony : సస్పెన్స్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నవిలక్షణ నటుడు విజయ్ ఆంటోనీ
Vijay Antony
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 10, 2022 | 7:31 AM

Vijay Antony : డాక్టర్ సలీమ్, బిచ్చగాడు, బేతాళుడు వంటి విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తన కొత్త సినిమా ‘హత్య’ అనే మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విజయ్. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో ఆయన నటిస్తుండగా..నాయిక రితికా సింగ్ సంధ్య అనే పాత్రలో పోలీస్ అధికారిణిగా కనిపించనుంది. లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగమ్ పిల్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మాతలు కాగా బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘1923లో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన డోరతీ కింగ్ మర్డర్ ఘటన నేపథ్యంగా ‘హత్య’ సినిమా సాగనుంది. అందమైన మోడల్ లీల తన ఇంట్లో హత్యకు గురవుతుంది. ఆమెను హత్య చేసిందెవరు అనేది మిస్టరీగా మారుతుంది. డిటెక్టివ్, పోలీస్ కోణంలో ఈ కేసు ఛేదనలో ఆసక్తికరంగా సినిమా సాగుతుంది. ఇతర కీలక పాత్రల్లో జాన్ విజయ్,రాధికా శరత్‌కుమార్, మురళీ శర్మ, సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు నటిస్తున్నారు.

ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ గతంలో విజయ్ ఆంటోనీతో కలిసి ‘విజయ్ రాఘవన్’ అనే చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం ఈ కాంబోలో ‘హత్య’ సినిమా నిర్మితమవుతుండగా..త్వరలో మరో రెండు ప్రాజెక్ట్ లు కలిసి చేస్తున్నారు. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా..ఆర్‌కె సెల్వ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం సమకూరుస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Malavika Mohanan: చీరకట్టులో అందాల విస్ఫోటనం.. మాళవిక మోహనన్ మైండ్ బ్లోయింగ్ పిక్స్

Viral Photo: భూమి మీదకు వచ్చిన ఊర్వశి.. చూపు తిప్పుకోనివ్వని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గుర్తుపట్టండి..

Kriti Sanon: నాజూకైన ఒంపుసొంపులతో అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్న కృతి సనన్