Akhanda: ‘అఖండ’శతదినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్న బాలయ్య అభిమానులు..
నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
Akhanda: నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. కరోనా కల్లోలం తర్వాత వచ్చిన అఖండ సినిమా భారీ కలెక్షన్స్ తో బాలయ్య కెరీర్లో 200 కోట్ల క్లబ్ లోకి చేరిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా వందరోజులు పూర్తి చేసుకోవడంతో కృతజ్ఞత సభను ఏర్పాటు చేయనున్నారు. అఖండ సినిమా శతదినోత్సవ వేడుకలు కర్నూల్ లో 12వ తేదీ జరగనున్నాయని దీనికి అఖండ సినిమా హీరో నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి సహా సినీ నటి నటులు హాజరుకానున్నారని కర్నూలు జిల్లా బాలకృష్ణ అభిమానుల సంఘం తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో నే కాక దేశ విదేశాలలో ప్రపంచ వ్యాప్తంగా పాకిస్తాన్ లో సైతం అభిమానుల ఆదరణకు నోచుకోని అఖండ విజయాన్ని సాధించిన అఖండ సినిమా శతదినోత్సవ వేడుకలు గేట్వే ఆఫ్ రాయలసీమ కర్నూల్ లో జరగడం బాలకృష్ణ అభిమానులకు పండగ లాంటిదని ఈ సభకు బాలకృష్ణ అభిమానులు స్థానికులు రాయలసీమ జిల్లాల నుండి రానున్నారని ని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి కరోనా నియమాలు పాటించి అఖండ శతదినోత్సవ వేడుకలు జయప్రదం చేయాలని బాలకృష్ణ అభిమానులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :