Bellamkonda Sai Sreenivas: బాలీవుడ్ సినిమా షూటింగ్ కు రెడీ అవుతున్న బెల్లంకొండ శ్రీనివాస్..
"ఒక్క అడుగు ఒకే ఒక్క అడుగు" అంటూ ప్రభాస్ చెప్పిన ఈ డైలాగ్ ఇప్పుడు బీ టౌన్‌లో కూడా మార్మోగనుంది.
Bellamkonda Sai Sreenivas:
“ఒక్క అడుగు ఒకే ఒక్క అడుగు” అంటూ ప్రభాస్ చెప్పిన ఈ డైలాగ్ ఇప్పుడు బీ టౌన్‌లో కూడా మార్మోగనుంది. అదే రేంజ్ హైలెవల్ యాక్షన్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు సౌత్ స్టామినా చూపించనుంది. అందుకోసమే అన్నట్టు పక్కా ప్లాన్ తో తాజాగా బరిలోకి దిగింది ఈ మూవీ యూనిట్. తెలుగులో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. వి.వి. వినాయక్ దర్శకుడిగా హిందీలో రి ఛత్రపతి సినిమా రీమేక్ అవుతుంది. ఈ సినిమాను నిర్మాత డా. జయంతిలాల్ గడ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఈ పాటికే చిత్రీకరణ ప్రారంభం కావాల్సిన ఈసినిమా.. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది. దానికి తోడు రీసెంట్‌గా హైదరాబాద్‌లో కురిసిన వర్షాలతో ఈ సినిమా కోసం వేసిన సెట్ పాడైంది. ఇప్పుడిప్పుడే కొవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితులు కాస్త కుదుటపడుతున్నాయి. ఈ క్రమంలో సినీ నిర్మాతలు షూటింగ్‌ల అనుమతుల కోసం వేచి చూస్తున్నారు.
పర్మిషన్ ఓకే కాగానే ఛత్రపతి రీమేక్‌ను షురూ చేయడానికి దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారట. హైదరాబాద్‌లో వర్షాల కారణంగా పాడైన విలేజ్ సెట్‌ను ఇప్పుడు రీసెట్ చేస్తున్నారట. జూలైలోగా ఆ సెట్ను రిసెట్ చేసి చిత్రీకరణ ప్రారంభించనున్నారట. అంతేకాదు హైదరాబాద్, ముంబై లతోపాటు బంగ్లాదేశ్‌లలో కూడా ఈ సినిమాను షూట్ చేయనున్నారట.
మరిన్ని ఇక్కడ చదవండి :