Salman Khan : మరోసారి మాస్ రాజా సినిమాపైన కన్నేసిన బాలీవుడ్ కండల వీరుడు..

అన్నం అవగానే వేడి వేడిగా తిన్నట్టు బాలీవుడ్ కండల వీరుడు సల్మనా ఖాన్ కూడా తెలుగు సినిమాలు రావడమే ఆలస్యం ఇక తీసేద్దాం అని అంటుంటారు.

Salman Khan : మరోసారి మాస్ రాజా సినిమాపైన కన్నేసిన బాలీవుడ్ కండల వీరుడు..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 17, 2021 | 9:17 AM

Salman Khan :

అన్నం అవగానే వేడి వేడిగా తిన్నట్టు బాలీవుడ్ కండల వీరుడు సల్మనా ఖాన్ కూడా తెలుగు సినిమాలు రావడమే ఆలస్యం ఇక తీసేద్దాం అని అంటుంటారు. అలా ఇప్పటికే చాలా తెలుగు సినిమాలను హిందీలో రిమేక్‌ చేసి స్టార్‌ డమ్‌ను సంపాదించారు. ఇక ఇప్పుడు ఏకంగా రిలీజ్ కాని ఓ సినిమాకే సూటి పెట్టేశారు సల్మాన్‌. అంతేకాదు రంగంలోకి ప్రొడ్యూసర్లను దింపి ఆ సినిమా రైట్స్ కావాలి తీసుకోండంటూ.. బేరసారాలు కూడా ఆడుతున్నారట. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. రీసెంట్‌గా ‘రాధే’ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన స‌ల్మాన్‌ఖాన్ రెండు ద‌క్షిణాది సినిమాల రీమేక్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న‌ట్లుగా బీ టౌన్లో టాక్ వినిపిస్తోంది.

అందులో ఒక‌టి విజ‌య్ హీరోగా న‌టించిన తమిళ చిత్రం “మాస్ట‌ర్” కాగా.. మరో సినిమా మాస్ మహారాజా ర‌వితేజ “ఖిలాడి”. అయితే ఇటీవల తన ఫ్రెండ్స్ ద్వారా ఖిలాడీ కాన్సెప్ట్‌ ను తెలుసుకున్న సల్లూ భాయ్‌.. ఈ సినిమాను రిమేక్‌ చేయాలనుకున్నారట. అంతేకాదు రిలీజ్‌ కాకముందే రీమేక్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నారట. ఇప్పుడిదే విషయం బీటౌన్‌లో హాట్ టాపిక్ గా మారింది.ఇక ఈ సినిమాను కూడా ఖిలాడీ డైరెక్టర్‌ ర‌మేశ్ వ‌ర్మ‌నే హిందీలోనూ తెరకెక్కించనున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే తొందర్లో ఈ మూవీ పై ప్రకటన కూడా చేస్తారట ఈ వాంటెడ్ భాయ్‌..

మరిన్ని ఇక్కడ చదవండి :

Allu Arjun Pushpa: పుష్ప సినిమాలో ఆ ఫైట్ కోసం హాలీవుడ్ కంపోజర్లను రంగంలోకి దింపనున్నారా..

Manoj Bajpayee: విలక్షణ నటనతో ఆకట్టుకున్న మనోజ్ బాజ్‌పాయ్‌ ‘ఫ్యామిలీ మ్యాన్’ కోసం ఎంత అందుకున్నారో తెలుసా..

Kavitha Son Death: సీనియర్‌ నటి కవిత ఇంట్లో కరోనా కల్లోలం… ఓ వైపు భర్త కోవిడ్ తో పోరాటం.. మరోవైపు కుమారుడు మృతి