AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun Pushpa: పుష్ప సినిమాలో ఆ ఫైట్ కోసం హాలీవుడ్ కంపోజర్లను రంగంలోకి దింపనున్నారా..

పుష్ప సినిమాతో వండర్స్‌ క్రియేట్ చేసేలా ఉన్నారు హీరో అల్లు అర్జున్‌ అండ్ డైరెక్టర్‌ సుకుమార్‌. కేవలం ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్‌ అంటూ ..

Allu Arjun Pushpa: పుష్ప సినిమాలో ఆ ఫైట్ కోసం హాలీవుడ్ కంపోజర్లను రంగంలోకి దింపనున్నారా..
pushpa
Rajeev Rayala
|

Updated on: Jun 17, 2021 | 7:53 AM

Share

Allu Arjun Pushpa :

పుష్ప సినిమాతో వండర్స్‌ క్రియేట్ చేసేలా ఉన్నారు హీరో అల్లు అర్జున్‌ అండ్ డైరెక్టర్‌ సుకుమార్‌. కేవలం ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్‌ అంటూ.. ఓ నిమిషంన్నర వీడియోతోనే రికార్డులు క్రియేట్ చేసిన ఈ స్టార్స్‌.. ఇప్పుడు ఓ సీన్‌తో ఆడియన్స్‌ రోమాలు నిక్కబొడిచేలా చేయాలనుకుంటున్నారట. ఇంతవరకు ఇండియన్‌ సెల్యూలాయిడ్ పై రాని విధంగా ఓ ఫైట్ సీక్వెన్స్‌ను ప్లాన్‌ చేస్తున్నారట. ఇప్పుడిదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం “పుష్ప”. పాన్‌ ఇండియా రేంజ్‌లో పాత ఫార్ములాకు భిన్నంగా.. రెండు భాగాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

ఎవర్‌ సీన్‌ అన్నట్టుగా ఈ సినిమాలో ఓ బోట్ ఫైట్ సీన్ ఉండనుందని గత కొద్దీ రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. బోట్‌ ఫైట్‌లు ఇండియన్‌ స్క్రీన్‌పై ఇంతకు ముందు కనిపించినప్పటికీ.. ఈ సినిమాలో వాటన్నింటికి మించి నెక్స్ట్‌ లెవెల్ అనేలా ఫైట్‌ ఉండాలని సుకుమార్‌ తాపత్రయ పడుతున్నారట. అందుకోసం ఇప్పటికే ఈ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్ను కూడా రెడీ చేసుకుని ఫైట్ మాస్టర్‌లతో మాట్లాడుతున్నారట. పాన్‌ ఇండియా మూవీ కావడం.. అందులోను అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండడంతో.. అన్ కాంప్ర‌మైజ్డ్‌గా ఈ మూవీ కోసం ఖర్చుపెడుతున్నారట మేకర్స్‌ . అంతే కాదు ఈ ఫైట్ సీన్స్ కోసం హాలీవుడ్ నుంచి కొందరు ఫైట్ కంపోజర్ లను కూడా దింపుతున్నారట. అలాగే క్వాలిటీ విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయడంలేదట ఈ మూవీ మేకర్స్‌. ఇంత ఖర్చాని ఎవరైనా అడిగితే సెల్యూలాయిడ్‌ పై చూసి చెప్పండంటూ.. ధీమాగా చెబుతున్నారని ఫిల్మ్ వర్గాల్లో టాక్‌.

మరిన్ని ఇక్కడ చదవండి :

Manoj Bajpayee: విలక్షణ నటనతో ఆకట్టుకున్న మనోజ్ బాజ్‌పాయ్‌ ‘ఫ్యామిలీ మ్యాన్’ కోసం ఎంత అందుకున్నారో తెలుసా..

Kavitha Son Death: సీనియర్‌ నటి కవిత ఇంట్లో కరోనా కల్లోలం… ఓ వైపు భర్త కోవిడ్ తో పోరాటం.. మరోవైపు కుమారుడు మృతి

Nithiin: స్పీడ్ పెంచిన నితిన్.. మరో కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యంగ్ హీరో

Follow Us
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?