AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithiin: స్పీడ్ పెంచిన నితిన్.. మరో కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యంగ్ హీరో

హీరో నితిన్‌ అప్పుడే మొదలెట్టేశారు. అందరి హీరోల కంటే ముందే రంగంలోకి దిగి.. హడావిడి చేస్తున్నారు. ఎవరితో సంబంధం లేదన్నట్టు టాప్‌ గేర్‌లో తన పనేదో తను చేసుకుంటూ పోతున్నారు. 

Nithiin: స్పీడ్ పెంచిన నితిన్.. మరో కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యంగ్ హీరో
Nithin
Rajeev Rayala
|

Updated on: Jun 17, 2021 | 7:05 AM

Share

Nithiin:

హీరో నితిన్‌ అప్పుడే మొదలెట్టేశారు. అందరి హీరోల కంటే ముందే రంగంలోకి దిగి.. హడావిడి చేస్తున్నారు. ఎవరితో సంబంధం లేదన్నట్టు టాప్‌ గేర్‌లో తన పనేదో తను చేసుకుంటూ పోతున్నారు.  కామెడీ క్రైమ్‌ థిల్లర్‌ జానర్లో తెరకెక్కి, బాలీవుడ్‌లో సూపర్‌ హిట్టైన సినిమా “అందాధున్‌” . మేర్లపాక గాంధీ డైరెక్షన్లో నితిన్‌ హీరోగా “మ్యాస్ట్రో” పేరుతో ఈ సినిమా రిమేక్‌ అవుతోంది. అయితే లాక్‌డౌన్‌ కంటే ముందే షరవేగంగా షూటింగ్‌ చేసిన నితిన్‌ అండ్‌ టీం… కరోనా పరిస్థితులు చక్కబడడంతో తాజాగా షూట్ను రెజ్యూమ్ చేశారు. అవును.. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్‌ తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇందులో భాగంగా నితిన్‌ తమన్నాలపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇక ఈ సినిమాలో నితిన్‌ సరసన నభానటేశ్‌ నటిస్తుండగా.. తమన్నా కీలకపాత్రలో కనిపించనున్నారు. శ్రేష్ఠ మూవీస్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మహతి స్వరా సాగర్‌ స్వరాలు అందిస్తున్నారు. నితిన్‌ పుట్టినరోజు కానుకగా ఇటీవల విడుదలైన ఈసినిమా ఫస్ట్‌గ్లిమ్స్‌ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుని సినిమాపై అంచనాలు పెంచాయి. ఇదిలా ఉంటే వచ్చే ఏడాదిలో కూడా ఆయన ఇదే జోరును కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. వక్కంతం వంశీకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్, త్వరలో ఆ సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడు. ఓ కొత్తదర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంతవరకూ ఎడిటర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఎస్.ఆర్.శేఖర్, మెగాఫోన్ పట్టాలనే ఆలోచనలో ఉన్నాడట.  ఆయన వినిపించిన కథకి నితిన్ ఓకే చెప్పాడని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Prabhas Adipurush: డార్లింగ్ అభిమానుల‌కు విజువ‌ల్ ట్రీట్ ఖాయం.. ఆదిపురుష్‌లో గ్రాఫిక్స్‌కు పెద్ద పీట‌..

Pawan Kalyan : ఆ సీన్ చేసేటప్పుడు పారిపోవాలనిపించింది.. షాకింగ్ విషయం చెప్పిన పవర్ స్టార్

Mosagallu Movie: ఓటీటీలోకి మంచు విష్ణు ‘మోసగాళ్లు’.. ప్రైమ్‏లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ..