Kriti Sanon : ‘ఆదిపురుష్’ ఈ అమ్మడికి తిరిగి టాలీవుడ్ ఆఫర్స్ అందిస్తుందా..?

బాలీవుడ్ బ్యూటీ కృతి తెగ ఎగ్జైట్ అవుతున్నారట. ఎప్పుడెప్పుడు ఆదిపురుష్‌ లొకేషన్లో అడుగు పెడదామా అని తెగ ఆరాట పడుతున్నారట.

Kriti Sanon : 'ఆదిపురుష్' ఈ అమ్మడికి తిరిగి టాలీవుడ్ ఆఫర్స్ అందిస్తుందా..?
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 17, 2021 | 6:50 AM

బాలీవుడ్ బ్యూటీ కృతి తెగ ఎగ్జైట్ అవుతున్నారట. ఎప్పుడెప్పుడు ఆదిపురుష్‌ లొకేషన్లో అడుగు పెడదామా అని తెగ ఆరాట పడుతున్నారట. పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ పక్కన ఎప్పుడు నటిస్తానా అంటూ ఊహల్లో విహరిస్తున్నారట. ఇప్పుడిదే విషయం బీటౌన్‌లో వైరల్‌ అవుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం “ఆదిపురుష్”. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ భారీ ఇతిహాస చిత్రంపై ఎనలేని అంచనాలు కూడా నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ను ఎంపిక చేసి షూటింగ్ కూడా కొన్ని రోజులు జరిపారు. ఆ తరువాత లాక్‌డౌన్‌ కారణంగా ఈ మూవీ షూట్ను ఆపేశారు.

ఇక సీతాదేవి పాత్రలో నటిస్తున్న కృతి సనన్ తన లేటెస్ట్ ఇన్స్టా చాట్స్ లో “ఆదిపురుష్” షూట్ పై ఎక్సైట్ అవుతున్నట్టు తెలిపారు. ఈ సరికొత్త ఎక్స్ పీరియన్స్ ను తాను చాలా డిఫరెంట్ గా ఫీల్ అవుతున్నానని, దాంతో పాటు ఫుల్ గా ఎంజాయ్‌ చేస్తున్నానని తన అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు “డైరెక్టర్ గారు త్వరగా మూవీ షూట్ ను స్టార్ట్‌ చేయండి” అంటూ సోషల్ మీడియా వేదికగా ఓం రౌత్‌ను రెక్వెస్ట్‌ కూడా చేస్తున్నారు. ఇక ఇదంతా చూస్తున్న నెటిజన్లు కృతికి తొందరెక్కువలా ఉందే అంటూ సోషల్ మీడియాలో కమెంట్లు చేస్తూ..కృతి స్టేట్ మెంట్‌ను వైరల్ చేసే పనిలో పడ్డారు. అయితే  గతంలో మహేష్ బాబు నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆతర్వాత నాగ చైతన్య నటించిన దోచేయ్ సినిమాలో చేసింది. ఈ రెండు సినిమాల తర్వాత కృతిసనన్ మళ్లీ తెలుగులో నటించలేదు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ లో చేస్తుంది. ఈ సినిమాతర్వాత ఈ అమ్మడికి తిరిగి టాలీవుడ్ లో ఆఫర్స్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Pawan Kalyan : ఆ సీన్ చేసేటప్పుడు పారిపోవాలనిపించింది.. షాకింగ్ విషయం చెప్పిన పవర్ స్టార్

Prabhas Adipurush: డార్లింగ్ అభిమానుల‌కు విజువ‌ల్ ట్రీట్ ఖాయం.. ఆదిపురుష్‌లో గ్రాఫిక్స్‌కు పెద్ద పీట‌..