Priyamani : ఆయన ఆమాట చెప్పకుంటే ఫ్యామిలీ మ్యాన్ చేసేదాన్ని కాదేమో..
ఎవరేమనుకున్నా సరే.. అప్పుడు కంటే ఇప్పుడే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నారు హీరోయిన్ ప్రియమణి..
Priyamani :
ఎవరేమనుకున్నా సరే.. అప్పుడు కంటే ఇప్పుడే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నారు హీరోయిన్ ప్రియమణి.. అంతేకాదు మరింత అందంగా కనిపిస్తూ ఫాలోవర్స్‌ను పెంచేసుకుంటున్నారు. ఇది సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్న మాట. అప్పట్లో.. సౌత్ ఇండియన్ సినిమాల్లో యాక్ట్ చేస్తూ.. వన్ ఆఫ్ ది టాలెంటెడ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు ప్రియమణి. కాని సూపర్ స్టార్ ఇమేజ్‌ను మాత్రం పట్టుకోలేక పోయారు. ఇక పెళ్లి చేసుకుని ఆల్మోస్ట్ సినిమాలకు దూరం అవుతున్న టైంలోనే ప్రియమణి తీసుకున్న ఓ డిసీషన తిరిగి ఈమెను సినిమాల్లో బిజీ అయ్యేలా.. అప్పటి క్రేజ్ కంటే ఇంకాస్త ఎక్కవ క్రేజ్ సంపాదించుకునేలా చేసింది.
ఓ రోజు డైరెక్టర్లు రాజ్ అండ్ డీకె ఫ్యామిలీ మ్యాన్ కథతో ప్రియమణిని అప్రోచ్ అయ్యారట. స్టోరీని తన క్యారెక్టర్ మొత్తం విన్నాక కూడా.. సిరీస్‌లో యాక్ట్ చేయడానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోయారట. అలాంటి కన్ఫూజన్ సమయంలోనే తన భర్త ముస్తాఫా రాజ్ ఓ మాట చెప్పారట. “ఆ టీం నీతో అంతసేపు మాట్లాడిందంటే నువ్వు నటించాలని వాళ్లు అనుకుంటున్నారు. గో ఫర్ ఇట్ ” అని అన్నారట. అలా రాజ్ చెప్పడం వల్లే ప్రియమణి ఆ సిరీస్ చేశారట ప్రియమణి. ఆతర్వాత ఈ వెబ్ సిరీస్ తో త్రూ అవుట్ ఇండియా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారట. ఇక ప్రియమణి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వెంకటేష్ నటిస్తున్న నారప్ప సినిమాలో చేస్తుంది. ఈ సినిమాలో ప్రియమణి పల్లెటూరి మహిళగా కనిపించనుంది. అలాగే రానా నటిస్తున్న విరాటపర్వం సినిమాలో చేస్తున్నది ఈ బ్యూటీ. ఇక విరాటపర్వం సినిమలో నక్సలైట్ పాత్రలో నటిస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :