వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న అక్కినేని అఖిల్..హీరో స్టార్ గా మారిపోతాడంటున్న అక్కినేని అభిమానులు..Akhil Akkineni video.

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇప్పటివరకు మూడు సినిమాల్లో నటించాడు. ఒక గెస్ట్ రోల్ లో మెరిశాడు. అక్కినేని ఫ్యామిలీ మెమరబుల్ హిట్ మనం సినిమాలో చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు అఖిల్. ఆతర్వాత యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ అనే సినిమా చేసాడు.

|

Updated on: Jun 17, 2021 | 9:26 AM

అక్కినేని ఫ్యామిలీ మెమరబుల్ హిట్ మనం సినిమాలో చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు అఖిల్. ఆతర్వాత యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ అనే సినిమా చేసాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత మనం దర్శకుడు విక్రమ్తో కుమార్ తో ‘హలో’ అనే సినిమా చేసాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆ వెంటనే ‘మిస్టర్ మజ్ను’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా విజయాన్ని అందుకోలేక పోయింది. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న అఖిల్ ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమా అయ్యాడు. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక అఖిల్ 5వ  సినిమాను ఏకంగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు ‘ఏజంట్’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. అలాగే ఈ యంగ్ హీరో మరో సినిమా  చేయబోతున్నాడని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చూడండి: రూ.12లకే ఇల్లు..త్వరపడండి అంటూ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. కానీ కండిషన్స్ అప్లై:new house at Rs 12 video.

క్లారిటీ ఇచ్చిన విజ‌య్ పీఆర్ టీమ్‌..విజయ్ పిల్లల ట్విట్ట‌ర్ అకౌంట్‌లు పూర్తిగా ఫేక్‌..:Fake Twitter accounts Video.

భార్య కోసం పాట పాడిన విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయినా అనుష్క శర్మ వైరల్ అవుతున్న వీడియో :Virushka Video.

1000 కోట్ల వసూళ్లు టార్గెట్ తో థియేటర్ లోకి అక్షయ్ కుమార్ ఒకే ఏడాదిలో 5 సినిమాలు : Akshay Kumar’s film video.

Follow us