AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Barrelakka: వెక్కి వెక్కి ఏడ్చిన బర్రెలక్క.. పెళ్ళైన సంతోషం లేదు అంటూ కన్నీళ్లు..

బర్రెలక్క గుర్తుందా..? సోషల్ మీడియాలో ఒకే ఒక్క వీడియోతో బాగా పాపులర్ అయ్యింది. డిగ్రీ చదువుకున్నా కూడా ఉద్యోగం రాలేదని దాంతో బర్రెలు కాస్తున్నా అని చెప్పి వైరల్ అయ్యింది. అప్పుడు ఆ వీడియో పెద్ద సంచలనమే.. దాంతో వచ్చిన పాపులారిటీతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది బర్రెలక్క.. ఆ ఎన్నికల్లో అంతగా ఆమె ప్రభావం చూపలేకపోయింది.

Barrelakka: వెక్కి వెక్కి ఏడ్చిన బర్రెలక్క.. పెళ్ళైన సంతోషం లేదు అంటూ కన్నీళ్లు..
Barrelakka
Rajeev Rayala
|

Updated on: May 06, 2025 | 6:34 PM

Share

బర్రెలక్క ఈ పేరు తెలియని తెలంగాణ ప్రజలు ఉండరేమో.. ఏపీలో కూడా ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అందరికి షాక్ ఇచ్చింది. ఒకే ఒక్క వీడియోతో పాపులర్ అయ్యింది బర్రెలక్క. నిరుద్యోగ సమస్య కారణంగా బర్రెలు కాస్తున్నా అని వీడియో చేసి ఓవర్ నైట్ లో పాపులర్ అయ్యింది. దాంతో ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష. డిగ్రీ పూర్తి చేసిన ఆమె ఉద్యోగం దొరక్క బర్రెలు కాస్తుంది. ఇక తన వీడియో పాపులర్ అవ్వడంతో ప్రజల సమస్యలు తీర్చడానికి అసెంబ్లీలో అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది. తెలంగాణ ఎలక్షన్స్ లో కొల్లాపూర్ స్ధానం నుంచి పోటీ చేసింది.

బర్రెలక్కకు చాలా మంది మద్దతుగా నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి. ప్రచారం కూడా ఆమె విస్తృతంగా చేసింది. కొల్లాపూర్ స్ధానం నుంచి పోటీ చేసిన బర్రెలక్క ఓడిపోయింది. ఆమెకుదాదాపు 6000వేల ఓట్లు పడ్డాయి. కానీ ఆమె క్రేజ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ఎన్నికల వేళ బర్రెలక్క పేరు మరు మ్రోగింది. సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ పెరిగారు. చాలా మంది పెద్ద వ్యక్తులు ఆమెకు అండగా నిలిచారు. ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు.ఆర్థికంగానూ కొందరు సాయం చేశారు. ఆ సమయంలో ఆమె గురించి చాలా ట్రోల్స్ వచ్చాయి.

ఇదిలా ఉంటే బర్రెలక్క పెళ్లి గురించి కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. ఆమె ఎవరెవరినో పెళ్లి చేసుకుంటుందంటూ రకరకాల ట్రోల్స్ వచ్చాయి. అయితే ఎన్నికల తర్వాత తన స్నేహితుడిని పెళ్లి చేసుకుంది బర్రెలక్క. కాగా ప్రస్తుతం ఆమె ఎక్కడా కనిపించడం లేదు. తాజాగా ఆమె ఓ వీడియోను షేర్ చేసింది. కన్నీళ్ళు పెట్టుకుంటూ ఓ వీడియోను షేర్ చేసింది బర్రెలక్క. తాను ఏ తప్పు చేయకపోయినా తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఎమోషనల్ అయ్యింది. ఎన్నికలు అయినపోయిన వెంటనే పెళ్లి చేసుకున్నందుకు తనను ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై లేనిపోని నిందలు వేయడంతో వెంటనే పెళ్లి చేసుకున్నా అని తెలిపింది. ట్రోల్స్ కు భయపడి నేను పెళ్లి చేసుకున్నా.. అయినా కూడా నన్ను వదలడం లేదు.. నన్ను ట్రోల్ చేసిన వారిని దేవుడు వదిలిపెట్టడు. ఎవరి కర్మ వారు అనుభవిస్తారు అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.